ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. బాహుబలి పుణ్యమా అంటూ ప్రభాస్ ఏజ్ అండ్ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరో అయిపోయాడు. దేశంలో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలే నోరెళ్ళ బెడుతున్నారు. అంతగా దేశవ్యాప్తంగా చాలామంది హీరోలు అసూయపడేలా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఏ హీరోకి లేని క్రేజ్ ప్రభాస్ కి రావటానికి గల కారణం ఏదైనా ఉందంటే అది దిగ్గజ దర్శకుడు రాజమౌళి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అమరేంద్ర ‘బాహుబలి’ గా ప్రభాస్ ని సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే రీతిలో చెక్కాడు.


ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ప్రభాస్ పాల్గొంటున్నాడు. దీంతో ఇటీవల బాహుబలి3 అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ప్రభాస్. బాహుబలి 2 విడుదలకు ముందు ఈ సిరీస్ కొనసాగుతుందని రాజమౌళి కూడా తెలిపాడు. కానీ బాహుబలి 3పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాజాగా ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి కథ ఇంకా పూర్తి కాలేదు. రెండు భాగాలు తీసినా మేము 60 శాతం కథని మాత్రమే చెప్పాం.


రాజమౌళికి ఆసక్తి కలిగినప్పుడు 'బాహుబలి 3' కూడా ఉంటుంది అని ప్రభాస్ తెలిపాడు. అయితే 'బాహుబలి 3' ఖచ్చితంగా ఉంటుందని మాత్రం తాను గ్యారెంటీ ఇవ్వలేనని ప్రభాస్ తెలిపాడు. దీంతో ప్రభాస్ ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు...ఖచ్చితంగా ఆ సినిమా కూడా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా 'సాహో' సినిమా మాత్రం పూర్తి యాక్షన్ ఎపిసోడ్ సినిమా అని...ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రీతిలో ఉంటాయి అంటూ ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చారు. ఆగస్టు 30వ తారీకున విడుదల కాబోతున్న 'సాహో' సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: