బాహుబలి వన్ టూ ఎంత పెద్ద హిట్లు అయ్యాయో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా టాలీవుడ్ రేంజిని ఎక్కడితో తీసుకెళ్ళిపోయాయి. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ సైరా  వంటి మూవీని  నేషనల్ కాన్వాస్ మీదకు తేవడానికి కూడా బాహుబలి కారణం. ఇక తెలుగులో ఎన్నో సినిమాలు ఇపుడు వందల కోట్ల బడ్జెట్లో తయారవడానికి కారణం కూడా బాహుబలి ఇన్సిపిరేషనే. ఆ విధంగా బాహుబ‌లికి టాలీవుడ్ ఎప్పటికీ థాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే టాలీవుడ్ స్టామినా ఇదీ అని ప్రూవ్ చేసిన బాహుబలిని ఎవరూ ఎప్పటికీ మరచిపోలేరు కూడా. 


ఇదిలా ఉండగా బాహుబలితో ఇంటర్నేషనల్ ఫేం అయిన ప్రభాస్  ఇపుడు ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేయడానికి సాహో మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ కోసం 350 కోట్ల ఖర్చు చేసాడు కూడా. మరి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఎక్కడో ఉంటాడనంతో సందేహం లేదు. ఇదిలా ఉండగా సాహో ప్రమోషన్లో ప్రభాస్ యమ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపించాడు.


అదేంటి అంటే బాహుబలి 3 కూడా తీసే అవకాశం ఉందని. ఇది నిజంగా ఫ్యాన్స్ తో పాటు అందరికీ సెన్సేషన్ న్యూస్ గానే చూడాలి. బాహుబలి వన్ టు రెండింటిలో కూడా కలిపి కధ కేవలం 60 శాతం మత్రమే తీశామని ప్రభాస్ చెప్పాడు. బాహుబలి 3 తీయడానికి కావాల్సిన కధ రెడీగా ఉందని, రాజమౌళిలో ఆ ఉత్సాహం కూడా ఉందని అన్నాడు. అన్నీ కలిస్తే తొందరలోనే బాహుబలి 3 ని కూడా అందరూ చూడొచ్చు అన్న మాట. ఇది మరెంతటి హిట్ కొడుతుందో చూడాలి.  బాహుబలి ప్రభంజనం మళ్ళీ స్టార్ట్ అయితే ఆ కిక్కే వేరబ్బా.




మరింత సమాచారం తెలుసుకోండి: