నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. శుక్రవారం ఎపిసోడ్లో వాటర్ తో ఆడుకున్నందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వాటర్ రాకుండా చేస్తాడు . వాటర్ తో ఆడుకున్న ఇంటి సభ్యులు బిగ్ బాస్ కు క్షమాపణ చెబుతారు. వాటర్ రాకపోవటానికి తను కూడా ఒక కారణమని శివజ్యోతి బాధపడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఈగ చనిపోవటంతో బాబా భాస్కర్ కొంతసమయం కామెడీ చేస్తాడు. 
 
నాగార్జున నిన్నటి ఎపిసోడ్ ను ఆసక్తికరంగా నడిపించాడు. మహేశ్ విట్టా, అలీ గొడవ పడుతుంటే ఎందుకు ఆపలేదని బాబా భాస్కర్ ను అడుగుతాడు నాగార్జున. అందరినీ కంట్రోల్ చేయాలని బాబా భాస్కర్ కు సూచిస్తాడు నాగార్జున. అలీ రేజాను అంత అహంకారం ఎందుకని నాగార్జున ప్రశ్నిస్తాడు. కెప్టెన్ శివ జ్యోతి మాట ఎందుకు వినలేదని ప్రశ్నిస్తాడు నాగార్జున. శివజ్యోతి ఆపేయమని చెప్పినపుడు ఎందుకు ఆపలేదని అడుగుతాడు నాగార్జున. అలీ తనను తాను మార్చుకుంటానని నాగార్జునకు చెబుతాడు. 
 
నాగార్జున ఇంటి సభ్యుల్లో మిత్రుడు, శత్రువు, వెన్నుపోటుదారులుగా ఒక్కొక్కరినీ ఎంచుకోమని చెబుతాడు. పునర్నవి రాహుల్ మిత్రుడని వరుణ్ శత్రువని వెన్నుపోటుదారు వితిక అని చెబుతుంది. హిమజ శ్రీముఖి మిత్రుడని వితిక శత్రువని వెన్నుపోటుదారు అషు అని చెబుతుంది. మహేశ్ మిత్రుడు బాబా అని శత్రువు అలీ అని వెన్నుపోటుదారు శ్రీముఖి అని చెబుతాడు. 
 
వితిక పునర్నవి మిత్రుడని శత్రువు హిమజ అని వెన్నుపోటుదారు రవికృష్ణ అని చెబుతుంది. రాహుల్ పునర్నవి మిత్రుడని హిమజ శత్రువని రవికృష్ణ వెన్నుపోటుదారు అని చెబుతాడు. అషు శివజ్యోతి మిత్రుడని బాబా భాస్కర్ శత్రువని హిమజ వెన్నుపోటుదారు అని చెబుతుంది. శ్రీముఖి బాబా మిత్రుడని రాహుల్ శత్రువని వితిక వెన్నుపోటు దారు అని చెబుతుంది. వరుణ్ మహేశ్ మిత్రుడని వితిక శత్రువని వెన్నుపోటుదారు పునర్నవి అని చెబుతాడు. శివ జ్యోతి అషు మిత్రుడని మహేశ్ శత్రువని వెన్నుపోటుదారు బాబా అని చెబుతుంది. బాబా మిత్రుడు శ్రీముఖి అని వెన్నుపోటుదారు అలీ మరియు మహేశ్ అని చెబుతాడు. రవికృష్ణ శివజ్యోతి మిత్రుడని అలీ శత్రువని వితిక వెన్నుపోటుదారు అని చెబుతుంది. అలీ శివజ్యోతి మిత్రుడని రవికృష్ణ శత్రువని హిమజ వెన్నుపోటుదారు అని చెబుతాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: