మాస్ రాజా  రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  లేటెస్ట్ మూవీ  'డిస్కోరాజా'.  ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  ఢిల్లీలో జరుగుతుంది. ఇక  ఈసినిమాలో రవితేజ కొత్త లుక్  ఇదే నంటూ నిన్న సోషల్ మీడియా లో ఓ పిక్  హల్ చల్ చేసింది.  ఇక ఆ ఫోటో ను చూసి  నెటిజన్లు  షాక్ అయ్యారు.  ఆ పిక్ లో రవితేజ ను పోలిన వున్న ఓ యువకుడు  కనిపించడంతో ఆశ్ఛర్య పోయారు.  అయితే అభిమానులను కూడా   ఆ లుక్  అయోమయానికి గురి చేసింది.  చాలా మంది ఆ ఫోటో లో వుంది రవితేజ నేనా  అనే అనుమానం వ్యక్తంచేశారు.  గంటల వ్యవధిలో ఈ వార్త వైరల్ గా మారింది.  ఇక  అసలు  విషయానికి వస్తే అసలు ఆ ఫోటో కు రవితేజ కు ఎలాంటి సంబంధం లేదు.  



ఈవిషయం ఫై తాజాగా  డైరెక్టర్ వి ఐ ఆనంద్ సామజిక మాధ్యమం  ద్వారా స్పందిస్తూ... ఆన్ లైన్ లో సర్క్యూలేట్ అవుతున్న రవితేజ పిక్ నిజం కాదు. ఈ ఫొటో ను ప్రమోట్ చేయడం లో డిస్కోరాజా టీం ఎవరు లేరు. రవితేజ అసలైన మేక్ ఓవర్ అదికాదు త్వరలోనే  డిస్కోరాజా నుండి రవితేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. దాంతో  నిన్న వైరల్ అయిన ఆ పిక్ రవితేజది కాదని  తేలిపోయింది.   



సైన్టిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో  ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో   నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్  కథానాయికలుగా నటిస్తున్నారు.  తమన్  ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా  తమిళ నటుడు బాబీ సింహ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు  తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: