శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఒక గేమ్ నిర్వహించారు. హౌస్ లో తమ మిత్రులెవరు, శత్రువులెవరు, అలాగే వెన్నుపోటుదారులెవరని చెప్పమన్నారు. ఇక్కడ అందరూ తమ తమ అభిప్రాయాలని తెలియజేసి వాటికి గల కారణాలని పంచుకున్నారు. అయితే ఇక్కడ రాహుల్ కి అనుకోని దెబ్బ తగిలింది. శత్రువుగా రాహుల్ హిమజని చూపించి, దానికి కారణం కెప్టెన్సీ టాస్క్ లో  తనని తోశానని రాంగ్ వే లో కన్వే చేసిందని చెప్పాడు. 


ఇదే విషయాన్ని వారం రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. నేనలా చేయలేదు చేయి పట్టి లాగాను అనుకుంటూ వస్తున్నాడు. అదే విషయం మీద హిమజని నామినేట్ చేశాడు. శనివారం కూడా అలాగే చెప్పేసరికి నాగార్జున దానికి మళ్ళీ వాదించుకోవడం ఎందుకు, వీడియో చూస్తే తెలుస్తుంది కదా అని వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో రాహుల్, హిమజని తోసినట్టే ఉంది. దాంతో అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. అయితే వీడియో చూపించిన తర్వాత హౌస్ మెంబర్స్ తో, ఈ వీడియో చూశాక మీరేమంటారని అడిగారు.


దానికి పక్కనే ఉన్న శ్రీముఖి  మమ్మల్ని కాదు ,వీడియో చూశావ్ కదా నువ్వెమంటావో చెప్పు అని పంచ్ వేసింది. రాహుల్ తన తప్పుని ఒప్పుకున్నాడు. శ్రీముఖికి రాహుల్ అంటే ఎప్పటి నుండో కోపం ఉన్న విషయం తెలిసిందే. రాహుల్ ఇలా దొరికిపోయే సరికి అదిరిపోయే పంచ్ ఇచ్చింది. నాగార్జున గారి ముందే రాహుల్ గాలి తీసేసిందనే చెప్పాలి. నిజానికి టాస్క్ లో అలా తోయడం కూడా పెద్ద తప్పు కాదు. కానీ రాహుల్ నేన చేయలేదు, చేయి పట్టి లాగాను అని అబద్ధం చెప్పడమే తప్పు. రాహుల్ చేసిన ఈ పని వల్ల అందరికీ దొరికిపోయాడు. మరి ముందు ముందైనా తన పవర్తనని మార్చుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: