సంపూర్ణేష్ ‘కొబ్బరిమట్ట’ ఘన విజయం సాధించడంతో ఈ మూవీ 3 కోట్ల నెట్ కలక్షన్స్ ను మన తెలుగు రాష్ట్రాలలో రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా 6.55 కోట్లు వసూలు చేయడంతో ఈ మూవీ నిర్మాతలకు 2.50 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఇచ్చిన సక్సస్ లో జోష్ లో ఉన్న సంపూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్ధిక స్థితి పై కొన్ని సంచలన విషయాలు షేర్ చేసాడు.

తాను సినిమాలకు సంబంధించి మొదటి పారితోషికం లక్షలలో అందుకున్నది ‘బందిపోటు’ సినిమా మాత్రమే అని చేపోతూ తన జీవితంలో 3 లక్షల డబ్బును చూసింది అదే ప్రధమం అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. తాను హీరో అయ్యాక కూడ చాల ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్న విషయాలను తెలియ చేస్తూ ఈ విషయాలను ఎవరికైనా చెప్పుకున్నా నమ్మేవారు కాదని హీరో పాత్రలు చేస్తున్న తనకు ఆర్ధిక బాధలు ఏమిటి అంటూ జోక్ చేసేవారని సంపూ తన బాధను బయట పెట్టాడు.

తన చిన్నప్పుడు తనకు కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఉండేవని చెపుతూ తన తల్లి చెల్లి బీడీలు చుట్టి తమ ఇంటిని పోషించిన విషయాలు తనకు ఇంకా గుర్తు అంటూ ఆనాటి తన సమస్యలను బయటపెట్టాడు. ఈ విషయాలను తన పిల్లలకు చెప్పినా వారు నమ్మడం లేదని అంటూ జోక్ చేసాడు. 

ఇండస్ట్రీలో ఎవరైనా ఒక హీరో కావాలి అంటూ కొత్త హీరోలను పరిశీలిస్తారని అయితే తన విషయంలో తాను తీయబోయే ‘హృదయకాలేయం’ సినిమకు చెత్త హీరో కావాలి అని తన మొఖం ముందే చెప్పి దానికి తాను సరిపోతానా లేదా అంటూ మేకప్ టెస్ట్ చేయించుకున్న ఏకైక హీరోని తానే అంటూ సంపూ వేసుకున్న జోక్ లో ఆవేదన ఉంది. ‘కొబ్బరిమట్ట’ సక్సస్ కావడంతో మళ్ళీ అలాంటి పేరడీ సినిమాల వైపు కాకుండా ఒక డిఫరెంట్ సినిమాను సంపూర్ణేష్ చేయగలిగితే అతని కెరియర్ కొంత కాలం కొనసాగే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: