టాలీవుడ్ సినిమా రంగానికి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఎంటర్ అయిన అనిల్ రావిపూడి, తొలి సినిమా తోనే సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఆయన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో తీసిన సుప్రీమ్, తరువాత వరుసగా రవితేజ హీరోగా రాజా ది గ్రేట్, అలానే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో తీసిన మల్టి స్టారర్ ఎఫ్2 సినిమాలు సహా, తన కెరీర్ లోని మొత్తం నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచి అనిల్ కు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్, 

ఇది సూపర్ స్టార్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే సినిమా అని, నా మార్క్ ఎంటర్టైన్మెంట్ లోనే సినిమా సాగుతూ, ఆయన ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని చెప్తున్నారు. ఇకపోతే గతంలో అనిల్ తీసిన పటాస్, సుప్రీమ్ సినిమాలను గమనిస్తే, ముందుగా పటాస్ లో కళ్యాణ్ రామ్ బాబాయి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని అరె ఓ సాంబ అనే సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసారు, ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో తీసిన సుప్రీమ్ లో ఆయన మావయ్య చిరంజీవిగారు నటించిన యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం అనే సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలతో చేసిన సినిమాల్లో వారి ఫ్యామిలీ హీరోల సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేసిన అనిల్ రావిపూడి, 

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో తీస్తున్న సరిలేరు నీకెవ్వరులో కూడా ఆయన తండ్రిగారైన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఒక హిట్ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే కృష్ణ గారి సినిమాల్లో ఏ సాంగ్ ని ఎంచుకున్నారు అనేది మాత్రం తెలియరాలేదు. నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ వార్త, ఒకవేళ నిజమే కనుక అయితే, సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు నిజంగా ఒక పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయాన్ని ప్రక్కన పెడితే, ఇప్పటివరకు మహేష్ బాబు, తన తండ్రి కృష్ణ గారి సినిమాలు కానీ, పాటలు కానీ రీమేక్ లేదా రీమిక్స్ చేయలేదని, మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే, ఫస్ట్ టైం మహేష్, తన తండ్రి కృష్ణ గారి సాంగ్ లో మహేష్ నటించడం చూడవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: