రాజమౌళి దగ్గర సహాయకులుగా పనిచేసిన ఏసహాయ దర్శకుడు ఇప్పటివరకు దర్శకులుగా రాణించలేకపోయారు. అయితే రాజమౌళిని ఏకలవ్యుడుగా ఆరాధించి రాజమౌళి స్పూర్తితో తీసిన తన సినిమా ట్రైలర్ ను విడుదలచేసి ఆ ట్రైలర్ ను రాజమౌళికి అంకితం చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమ్ సుప్రీమ్ అనే యువకుడు దర్శకత్వం వహిస్తున్న ‘తూనీగ’ మూవీ ట్రైలర్ ను నిన్న విడుదల చేసారు. క్రౌండ్ ఫండింగ్ విధానంలో రూపొందిన ఈమూవీ కథలో ‘ఈగ’ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఈగ’ మూవీతో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళికి తన ‘తూనీగ’ ను ప్రేమ్ సుప్రీమ్ అంకితం ఇచ్చాడు. 

అంతా కొత్తవారితో రూపొందింప బడ్డ ఈ మూవీ ట్రైలర్ లోని గ్రాఫిక్స్ చాల బాగున్నాయి. ఒక చిన్నసినిమాలో మంచి క్వాలిటీతో కూడిన గ్రాఫిక్స్ ఈ ట్రైలర్ లో కనిపిస్తూ ఉండటంతో నిజంగానే ఈ యంగ్ డైరెక్టర్ రాజమౌళిని తన గురువుగా ఆలోచించి స్పూర్తిని పొందాడ అని అనిపించడం సహజం. ఇప్పటికే ఒక తెలుగు దర్శకుడుగా రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా ఇమేజ్ ని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళాడు. 

అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక వెనుకబడిన జిల్లా ప్రాంతానికి చెందిన ఒక యంగ్ డైరెక్టర్ ఏకంగా రాజమౌళి హీరోగా వాడుకున్న ‘ఈగ’ ను ‘తూనీగ’ గా మార్చి చేస్తున్న ప్రయోగం పై చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. ఈమధ్య కాలంలో కొన్ని చిన్నసినిమాలు అనుకోని విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘తూనీగ’ కూడ చేరిపోతే రాజమౌళికి తనకు తెలియకుండానే ఒక అజ్ఞాత శిష్యుడు తయారు అవుతాడు. మరి ఈ ఏకలవ్య శిష్యుడు తీసిన ‘తూనీగ’ పై రాజమౌళి నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: