హృదయ కాలేయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంపూర్ణేష్ బాబు హీరోగా మరో చిత్రంలో కనిపించడానికి ఐదేళ్లు పట్టింది. తన రెండో చిత్రంగా నటించిన కొబ్బరిమట్ట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ నాలుగు సంవత్సరాలకుపైగానే పట్టింది. చివరకు భారీ క్రేజ్ మధ్య, ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొబ్బరిమట్ట చిత్రం భారీగా ఓపెనింగ్స్ సాధించింది.


రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని ఓసారి గమనిస్తే, హృదయం కాలేయం సినిమా హిట్ తర్వాత సంపూర్ణేష్ బాబు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానికి తోడు కొబ్బరిమట్ట టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు సంపూ చెప్పిన మూడు నిమిషాల డైలాగ్ తో మరింత క్రేజ్ వచ్చింది. వీటన్నింటి వల్ల తొలి రోజున నాగార్జున  మన్మథుడు2 సినిమాకు సమానంగా కలెక్షన్లు రాబట్టింది. వారాంతం కలెక్షన్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు.


కొబ్బరి మట్ట తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజై మంచి వసూళ్లను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.3.04 కోట్ల వసూళ్లను రిజిస్టర్ చేసింది. దాదాపు అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు లాభాలు ఆర్జించారు.ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో సంపూర్ణేష్ ఓ మోస్తారుగా కలెక్షన్లు రాబట్టాయి. రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 3.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది.


ఇక ప్రపంచవ్యాప్తంగా కొబ్బరిమట్ట సినిమా 100 శాతం లాభాలను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మొత్తంగా రూ.6.55 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.2.50 కోట్లకుపైగా లాభాల్ని సంపాదించింది. ఈ మధ్యకాలం ఓ చిన్న సినిమా లాభాలను పంచిపెట్టడం కొబ్బరిమట్టతోనే సాధ్యమైందనే చెప్పాలి. కొబ్బరి మట్ట కలెక్షన్లు చూసి టాలీవుడ్ షాక్ అయింది. ఒక చిన్న సినిమాగా మొదలై ఇన్ని లాభాలు ఆర్జించడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే!



మరింత సమాచారం తెలుసుకోండి: