టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2016లో యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మోత్సవం. పివిపి నిర్మాణ సంస్థపై అప్పట్లో క్రేజీ ప్రాజక్ట్ గా రూపొందిన ఆ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే చివరకు రిలీజ్ తరువాత ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టడం జరిగింది. నిజానికి అంతకముందు మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల ల కాంబినేషన్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రావడం, ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో బ్రహ్మోత్సవంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

అయితే అప్పట్లో ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత, నిర్మాత పివిపి మరియు హీరో మహేష్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు కూడా వార్తలు రావడం జరిగింది. ఇక నేడు బ్రహ్మోత్సవం ఫ్లాప్ పై నిర్మాత పివిపి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన నిజాలు బయట పెట్టడం జరిగింది. గతంలో మహేష్ గారు, శ్రీకాంత్ గారి కాంబోలో సీతమ్మ వాకిట్లో మూవీ మంచి హిట్ సాదించడంతోనే, తాము బ్రహ్మోత్సవం సినిమాను నిర్మించడానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు. అయితే సినిమా ప్రారంభినికి ముందు స్క్రిప్ట్ పూర్తి కాలేదని, ఆ విధంగా స్క్రిప్ట్ సిద్ధంగా లేకుండానే శ్రీకాంత్ గారు సినిమా షూటింగ్ మొదలెట్టి కొనసాగించారని ఆయన అన్నారు. 

ఇక షూటింగ్ ప్రారంభానికి ముందు స్క్రిప్ట్ విషయమై నేను ఆయనకు పంపిన ఇమెయిల్స్ నా దగ్గరే ఉన్నాయి, అందులో నేను ఆయనను స్క్రిప్ట్ విషయమై ఎంతో సౌమ్యంగా మాట్లాడిన విధానం మీరు గమనించవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఈరోజున కేవలం తనకు మాత్రమే కాక, దాదాపుగా అందరు నిర్మాతల పరిస్థితి ఇదే విధంగా దారుణంగా ఉందని, నిర్మాత కేవలం డబ్బుపెట్టే ఒక యంత్రం మాత్రమేనని, సినిమా రిలీజ్ కు కొద్దిరోజుల ముందు మాత్రమే దర్శకులు, నిర్మాతలకు పూర్తి సినిమా వేసి చూపుతున్న రోజులివని, ఈ విధమైన పరిస్థితి మారనంతవరకు నిర్మాతలకు సమస్యలు తప్పవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: