అడివి శేష్ క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న హీరో. థ్రిల్లర్ సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకు అడివి శేష్ మార్కెట్ పెంచుకుంటున్నాడు. అడివి శేష్ సినిమాలు నిర్మాతలకు కూడా భారీ లాభాల్ని అందిస్తున్నాయి. అడివి శేష్ నటించిన ఎవరు సినిమా రిలీజ్ కు ముందు పది కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ చేయగా మొదటివారంలో పది కోట్ల రుపాయలు వసూలు చేసి భారీ లాభాల్ని అందిస్తోంది. 
 
ఇప్పుడు వరుస విజయాలు అందుకున్న అడివి శేష్ ఒకప్పుడు మాత్రం చాలా కష్టాలు పడ్డాడు. కెరీర్ మొదట్లో కర్మ, కిస్ అనే సినిమాలను నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం కూడా వహించాడు అడివి శేష్. కానీ ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. 2013లో వచ్చిన కిస్ సినిమాకు రెండు కోట్ల రుపాయలు అప్పు తెచ్చి సినిమాకు ఖర్చు పెట్టాడు అడివి శేష్. కానీ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా పోస్టర్లకు పెట్టిన ఖర్చు కూడా వెనక్కు రాలేదని తెలుస్తుంది. 
 
దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో అడివి శేష్ ఈ రెండు సినిమాల తరువాత దర్శకత్వం జోలికి పోలేదు. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని పోలీసులతో ఫోన్లు చేయించేవారని ఢిల్లీలో పోలీసుల మద్యలో నిలబడాల్సి వచ్చిందని అడివిశేష్ చెప్పారు.పంజా, బలుపు, బాహుబలి సినిమాలు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అడివి శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్షణం, గుఢచారి సినిమాలకు అడివి శేష్ కథ మాత్రం అందించాడు. 
 
కష్టాల్లో ఉన్న సమయంలో నిర్మాత పీవీపీ గారు తనను ఆదుకున్నారని నమ్మి క్షణం సినిమాను నిర్మించారని అడివి శేష్ చెప్పాడు. ఇప్పుడు తన కథల మీద నమ్మకంతో చాలా మంది నిర్మాతలు తనతో సినిమాలు తీయటానికి సిధ్ధంగా ఉన్నారని అడివి శేష్ చెప్పారు. టాలీవుడ్లో ప్రస్తుతం అడివి శేష్ ను మినిమం గ్యారంటీ హీరో అని అంటున్నారు. అడివి శేష్ ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: