నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను తన అభిమానులకు షేర్ చేసే అల్లు అర్జున్ ఈరోజు షేర్ చేసిన ఒక కొత్త విషయం చూసి బన్నీ అభిమానులు ఆనంద పడుతున్నారు. లేటెస్ట్ గా తాను కొనుక్కున్న రేంజ్ రోవర్ కారును తన అభిమానులకు చూపెడుతూ తాను ఇలాంటి విలాస వంతమైన వస్తువులు కొనుక్కున్నప్పుడల్లా తనకు తన అభిమానుల ప్రేమ గుర్తుకు వస్తుంది అంటూ తన కొత్త కారు ఫోటోతో పాటు తన కామెంట్స్ ను షేర్ చేసాడు. 

అల్లు అర్జున్ ఇలాంటి విలాస వంతమైన కార్లు కొనుక్కోవడం కొత్త విషయం కాకపోయినా తాను కొనుక్కున్న ప్రతి కొత్త కారుకు ఒక పేరు పెట్టడం అతని హాబీ. ఈ క్రమంలో తన లేటెస్ట్ కారుకు ‘బీస్ట్’ అన్న పేరు పెట్టుకున్నాడు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక వాహనం నిక్ నేమ్ కూడ ‘బీస్ట్’ కావడంతో బన్నీ అభిమానులు అతడిని అమెరికా అధ్యక్షుడు స్థాయిలో ఊహించుకుని తెగ సంబర పడిపోతున్నారు. ఇప్పటికే బన్నీకి చాల ఖరీదైన క్యార్ వాన్ ఉంది. ఇప్పుడు ఈ ఖరీదైన కారు కూడ తోడవ్వడంతో ఇండస్ట్రీలో బన్నీకి ఉన్న విలాసవంతమైన కార్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

 ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అల వైకుంఠపురం’ షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న పరిస్థుతులలో ఈ మూవీని సంక్రాంతి రేసుకు తీసుకు వచ్చి సంక్రాంతి రేస్ విజేతగా మారాలని బన్నీ చాల ఆశలు పెట్టుకున్నాడు. దీనికితోడు ఈ ఏడాది ఒక్క సినిమా కూడ బన్నీ వైపు నుండి లేకపోవడంతో నిరాశ పడ్డ అభిమానులకు వారు కోరుకునే హిట్ అందించడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనితో ఇతడి  కలలు ఎంత వరకు నెరవేరురుతాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: