అగ్ర  దర్శకుడు  రాజమౌళి  దర్శకత్వంలో  టాలీవుడ్  బిగెస్ట్ మల్టీస్టారర్ గా  తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండగా  ఇటీవల  వీరిద్దరూ గాయపడడంతో షూటింగ్ కు  బ్రేక్ ఇచ్చారు. ఇక కొద్దీ రోజుల క్రితం మళ్ళీ ఈ సినిమా షూటింగ్  ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  బల్గెరియా లో జరుగుతుందని సమాచారం.  నెల రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో  ఎన్టీఆర్ ఫై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.   కాగా ప్రస్తుతం రామ్ చరణ్  సైరా ప్రమోషన్స్ తో బిజీ గా వున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాకే చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పూర్తి స్థాయిలో పాల్గొననున్నాడట. 




పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో  సుమారు 300 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుంది  ఎన్టీఆర్ కు ఇంకా హీరోయిన్ ను ఖరారు చేయలేదు.   స్వాతంత్య్ర  సమర యోధులు   అల్లూరి సీతారామరాజు, కొమరం భీం  జీవిత  చరిత్రలను బేస్ చేసుకొని రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వీరితో పాటు  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లోనటిస్తున్నారు. 




ఇక అక్టోబర్ 22 కొమరం భీం జయంతి సందర్భంగా ఈచిత్రంనుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదలచేయనున్నారు.  భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  వచ్చే ఏడాది జులై 30 న ఈ సినిమా  అన్ని ప్రముఖ భాషల్లో  భారీ స్థాయిలో  విడుదలకానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: