బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్  హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఎనౌన్స్ చేయలేదు.


ఇదిలాఉంటే సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారమరాజుగా కనిపిస్తుండగా.. తారక్ కొమరం భీంగా నటిస్తున్నాడు. ఇద్దరి పాత్రలకు పూర్తిస్థాయి మేకోవర్ ఉంటుందని తెలుస్తుంది. అయితే సైరా ప్రమోషన్స్ కోసం చరణ్ తన మీసపు కట్టుగా సీతారామరాజు ఫేస్ కట్ ఎలా ఉంటుందో చూపించాడు.


ఇక తెలియాల్సి ఉంది తారక్ లుక్కే. అయితే తారక్ కు సంబందించిన ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 22న రిలీజ్ చేయబోతున్నారట. అక్టోబర్ 22న కొమరం భీం జయంతి. ఆయన జయంతి నాడు తారక్ ఫస్ట్ లుక్ వస్తుందని తెలుస్తుంది. ప్రమోషన్స్ లో రాజమౌళిని మించిన వారు ఎవరు ఉండరని తెలిసిందే. బాహుబలి తర్వాత చేస్తున్న ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కూడా బాహుబలి రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నడు.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. మరి రీల్ హీరోస్ రియల్ హీరోల కథతో వస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ తప్పకుండా మళ్లీ మరో సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. సినిమాలో అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఊగిపోయే సీన్స్ ఎన్నో ఉంటాయట. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఆర్.ఆర్.ఆర్ మరోసారి తెలుగు సినిమా సత్తా చాటుతుందని అంటున్నారు. సినిమాలో చరణ్, తారక్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా నటిస్తున్నారని తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: