మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చిరు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాను తనయుడు రాం చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. రీసెంట్ గా చిరు బర్త్ డే కానుకగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.


చిరు 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహా రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో సర్ ప్రైజ్ రోల్ లో రాం చరణ్ కూడా కనిపించాల్సి ఉందట. ఆల్రెడీ ఖైది నంబర్ 150లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ లో చరణ్ ఎంట్రీ తెలిసిందే. అలా కాకుండా సైరాలో ఓ చిన్న కెమియో రోల్ చేయాలని అనుకున్నారు.  


అయితే ఎందుకో ఏమో కాని మళ్లీ రాం చరణ్ ఆ పాత్ర చేయకూడదని అనుకున్నాడట. అదీగాక రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ కోసం స్పెషల్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే ఒకవేళ సైరాలో కనిపించాల్సి వస్తే ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ ఆర్ లుక్ తోనే కనిపించాలి అందుకే రాం చరణ్ తన పాత్రను వద్దనుకున్నాడు.


సినిమాకు బూస్టింగ్ ఇచ్చేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంది అది చాలు మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకోడానికి. అయితే సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక చిన్న రోల్ చేస్తాడని అనుకున్నారు కాని అది జరుగలేదు. స్వీటీ అనుష్క మాత్రం ఓ సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తుందట. అయితే ఆమె పాత్ర గురించి సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు. బాహుబలి తర్వాత అంత పెద్ద భారీతనంతో వస్తున్న సైరా సినిమా కచ్చితంగా మరోసారి చిరు స్టామినా ప్రూవ్ చేస్తుందని అనుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: