న్యాచురల్ స్టార్ నానీకి గత కొంత కాలంగా సరైన హిట్ రావట్లేదు. భలే భలే మగాడివోయ్, జెంటిల్ మేన్, నేను లోకల్, నిన్ను కోరి, ఎమ్ సీ ఎ సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు నాని. కానీ గత సంవత్సరం నుండి నాని నటించిన సినిమాలేవీ ఆశించిన ఫలితాన్ని అందుకోవట్లేదు. నాని నటించిన కృష్ణార్జున యుధ్ధం ప్లాప్ కాగా దేవదాస్ సినిమా పరవాలేదనిపించే ఫలితాన్ని అందుకుంది. 
 
ఈ సంవత్సరం విడుదలైన జెర్సీ సినిమాకు క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలే వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జెర్సీ అబవ్ యావరేజ్ అనిపించుకుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చే నెల 13 వ తేదీన విడుదల కాబోతుంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో " V " అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ సినిమాలో నాని సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు సమాచారం. తొలి సినిమా చి ల సౌ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రాహుల్ రవీంద్రన్. రెండో సినిమా మన్మథుడు2 మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ రాహుల్ చెప్పిన లైన్ నచ్చటంతో నాని ఈ సినిమాకు ఓకె చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ పూర్తి కథను సిధ్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. 
 
ప్రస్తుతం రకుల్ కు కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. 2017 వ సంవత్సరంలో వచ్చిన స్పైడర్ సినిమా ఫ్లాప్ తరువాత రకుల్ కు అవకాశాలు తగ్గాయి. స్పైడర్ తరువాత రకుల్ కథానాయకుడు సినిమాలో స్పెషల్ పాత్రలో నటించగా, నాగార్జున మన్మథుడు 2 సినిమాలో నటించింది. తమిళం, హిందీ భాషల్లో అవకాశాలు బాగానే వస్తున్నా తెలుగులో మాత్రం రకుల్ కు అవకాశాలు తగ్గాయి.మరి నానీతో నటించబోయే సినిమాతోనైనా రకుల్ హిట్ కొట్టి తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: