టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సీనియర్ హీరోల వారసులు వెండి తెరకు పరిచయం అయ్యి సిల్వర్ స్క్రీన్ పై వాళ్లకు వాళ్లు ప్రూవ్ చాలా మంది చేసుకున్నారు. కానీ అక్కినేని వంటి పెద్ద కుటుంబం నుండి నాగార్జున కొడుకుగా వెండితెరకు పరిచయమైన అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటివరకు హిట్ కొట్టలేక పోయాడు. అన్న నాగ చైతన్య దూసుకుపోతున్నాడు. దీంతో కింగ్ నాగార్జున రెండో కొడుకు అఖిల్ కి మంచి హిట్టు పడాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for AKKINENI akhil pooja hegde

మొన్నటి వరకు ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అన్నదానిపై రకరకాల వార్తలు వినపడ్డాయి. మొదటిగా సినిమాలో అఖిల్ పక్కన సాయి పల్లవి హీరోయిన్ అని అందరూ అనుకున్నారు ఇదే సమయంలో సాయి పల్లవి కూడా రెడీ అయ్యింది. కానీ చివరి నిమిషంలో సినిమా నుండి అనుకోకుండా డ్రాప్ అయ్యింది. ఇదే తరుణంలో తర్వాత రష్మికని హీరోయిన్ గా తీసుకుందామంటే.. ఆమె ప్రస్తుతం చాలా బిజీగా  ఉంది. సో.. కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. ఫైనల్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

Image result for AKKINENI akhil pooja hegde

అయితే ఈ సినిమాకి ఆమె ఎంత డిమాండ్ చేసిందో తెలుసా.. అక్షరాలా.. రూ.3.5 కోట్లు.. దీంతో మొదటి గీతాఆర్ట్స్ వెనక్కి తగ్గింది. కానీ అఖిల్ ఒత్తిడి తీసుకురావడంతో ఒప్పుకోక తప్పలేదు. దీంతో త్వరలోనే పూజాహెగ్డే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'వాల్మీకి', 'అల వైకుంఠపురం' వంటి సినిమాల్లో నటిస్తోంది. చేసిన మూడు సినిమాలు దారుణమైన ఫలితాలు రావడంతో ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కోడతారేమో అని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు మరియు కుటుంబ సభ్యులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: