ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో భారతదేశం ఎన్నడూ చూడని విధంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ ను చేసింది. అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ సేల్స్ సాధించిన ఈ చిత్రం రాజమౌళి బాహుబలి 2 మరియు రజినీకాంత్ 2.0 చిత్రాల తర్వాత అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు సాహో ముందు ఉన్న టార్గెట్ అంత పెద్ద సవాలు కాకపోయినా వాళ్లు సాధించాల్సిన మొత్తం ఏమీ తక్కువేమీ కాదు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కలిపి సాహో మొత్తం 125 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో నైజాంలో 40 కోట్లు చేయగా సీడెడ్లో 24 కోట్ల బిజినెస్ చేసింది. తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో 19 కోట్లు, వైజాగ్ లో 15 కోట్లు, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో కలిపి 17 కోట్లు భారీ మొత్తం చేసింది. ఇక కర్ణాటకలో 28 కోట్లు మరియు తమిళనాడులో 20 కోట్లతో పెద్ద మొత్తంలో బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను అన్ని భాషల్లో కలిపి నలభై రెండు కోట్లకు దుబాయ్ లోని ఫార్స్ ఫిలిమ్స్ కు అమ్మింది. మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి సాహో మొత్తం 290 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసింది.

కాబట్టి సాహో మొత్తంగా ఒక మూడు వందల కోట్ల రూపాయల షేర్ కనుక సాధిస్తే డిస్ట్రిబ్యూటర్లు తాము పెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోగలరు. ఇది చాలా పెద్ద మొత్తమే అయినా ఇప్పుడు చిత్రానికి ఉన్న హైప్ మరియు ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో చాలా సులువుగా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరొకవైపు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాహో దక్షిణాది భాషలన్నిటిలో కలిపి 40 కోట్లకు అమ్మగా శాటిలైట్ హక్కులు మరియు మ్యూజిక్ హక్కులను కలిపి మొత్తంగా ఒక 500 కోట్ల బిజినెస్ ను చేసింది. ఇంతకు మునుపు 2.0, 550 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి మొదటి స్థానంలో ఉండగా బాహుబలి టు 510 కోట్ల బిజినెస్ తో సాహో కన్నా ముందు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: