ప్రస్తుతం దేశమంతా సాహో మేనియా నడుస్తోంది. మరో అయిదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓపక్క ప్రభాస్ దేశమంతా చుట్టేస్తూ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఎక్కడికక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ వార్తలన్నీ బయటకి వస్తున్నాయి. అందులో బ్యాడ్ బాయ్.. అనే పాట గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

 


శ్రీలంకన్ బ్యూటీ జాక్వలైజ్ ఫెర్నాండెజ్ ఈ సాంగ్ లో నటించి పాటకు సెక్స్ అప్పీల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. వాస్తవానికి ఈ పాటలో నటించడానికి టాలీవుడ్ చందమామ కాజల్ ను సంప్రదించారట నిర్మాతలు. కానీ ఈ పాటకు కాజల్ చెప్పిన రెమ్యునరేషన్ విని షాక్ గురవటం నిర్మాతల వంతైందట. ఇక దీనిపై ఏమాత్రం చర్చలు జరపకుండా బాలీవుడ్ బ్యూటీకి షిప్ట్ అయ్యారట నిర్మాతలు. ఈ అమ్మడికి కూడా భారీ రెమ్యునరేషనే ఇచ్చారు కానీ కాజల్ చెప్పినదానికి చాలా పొంతన ఉందట. బాలీవుడ్ బ్యూటీ కాబట్టి ఇండియా అంతా ఫేమ్ ఉంటుంది కాబట్టి నిర్మాతలు మరేం ఆలోచించలేదన ఫిలిం సర్కిల్స్ లో రౌండ్స్ అవుతోంది ఈ వార్త. ఇందులో నిజమెంతుందో గానీ.. ఈ వార్త నిజమైతే కాజల్ భారీ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే లెక్క.

 


కాజల్ క్రేజ్ కూడా తక్కువేం కాదు. సౌత్ లో ఆమె టాప్ హీరోయిన్. మూడేళ్ల క్రితం ఆమె ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ సూపర్ హిట్. అందుకే నిర్మాతలు అప్రోచ్ అయ్యుంటారని కాజల్ కు ఇష్టం లేదేమోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: