యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సాహో. అత్యంత భారీ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉందని టీజర్, ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఆగష్టు 30న రిలీజ్ అవుతుండగా సినిమా కోసం అంతా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.


తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న సాహో సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యు.ఏ.ఈ సెన్సార్ సభ్యుడు, క్రిటిక్ ఉమైర్ సంధు ప్రభాస్ సాహో మొదటి రివ్యూ ఇచ్చేశాడు. ప్రభాస్ ఎంట్రీ నుండి ఎండింగ్ వరకు సినిమా అదిరిపోయిందని.. నెగటివ్ గా కనిపించే పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించాడని అన్నారు.


ఇలాంటీ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టమని ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేశాడు. యాటిట్యూడ్, స్టార్ పవర్ కలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కావాల్సిన దానికన్నా ఎక్కువే ఈ సినిమా అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ గత రికార్డులను తుడిచిపెట్టేలా ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ట్వీట్ చేశారు ఉమైర్ సంధు.


మొత్తానికి ప్రభాస్ బాహుబలి తర్వాత పర్ఫెక్ట్ సినిమా చేశాడని ఈ రివ్యూని బట్టి చెప్పొచ్చు. అయితే ఉమైర్ సంధు రివ్యూ సూపర్ ఇచ్చిన స్టార్ సినిమాలు కొన్ని అతని చెప్పినట్టుగానే సూపర్ హిట్ అవగా చాలా వరకు ఫ్లాప్ అయాయి. అందుకే ఉమైర్ సంధు రివ్యూస్ మీద తెలుగు ఆడియెన్స్ హోప్స్ పెట్టుకోవట్లేదు. ఒకవేళ నిజంగానే సాహో సూపర్ హిట్ అయితె ఉమైర్ సంధు రివ్యూస్ ఇక మీదట నమ్మే ఛాన్స్ ఉంది. ఒకవేళ తేడా కొడితే మాత్రం ఉమైర్ సంధు రివ్యూస్ వంక చూసే అవకాశం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: