నాచురల్ స్టార్ నాని హీరోగా, విభిన్న తరహా కథ, కథనాలతో సినిమాలు తీసి మంచి సక్సెస్ అందుకునే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఎదుర్కొన్నన్ని సమస్యలు మరే సినిమా కూడా ఎదురుకోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. వాస్తవానికి ఈనెల 30వ తేదీన రిలీజ్ కావలసిన ఈ సినిమా, సడన్ గా సాహో యూనిట్ అదే రోజున తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో, గ్యాంగ్ లీడర్ టీమ్ కొంత ఆలోంచనలో పడింది. అయితే ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాతో పోటీ పెట్టుకోవడం సరికాదని భావించి, తమ సినిమాను మరొక 15 రోజులు ముందుకు జరిపి సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల డేట్ అనౌన్స్ చేసారు గ్యాంగ్ లీడర్ నిర్మాతలు. 

అయితే ఈ డేట్ తో కూడా ఇప్పుడు మరొక చిక్కు వచ్చి పడింది, అదే రోజున తమ సినిమాను రిలీజ్ చేస్తున్నామని, కొద్దిరోజుల క్రితమే వాల్మీకి టీమ్ కూడా ప్రకటించింది. అయితే ఎట్టకేలకు వాల్మీకితో పోటీ సిద్దమైన గ్యాంగ్ లీడర్, ఆ సినిమాతో పోటీగా తమ మూవీ ప్రమోషన్ విషయమై మాత్రం కాస్త వెనుకపడింది. ఇప్పటికే వాల్మీకి నుండి రిలీజ్ అయిన టీజర్, లిరికల్ సాంగ్, వీడియో సాంగ్ ప్రోమోలు యూట్యూబ్ దుమ్ము దులుపుతున్నాయి. అయితే గ్యాంగ్ లీడర్ మొన్నటివరకు కాస్త నత్తనడకన ప్రమోషన్ మొదలెట్టి, మొత్తానికి రేపటినుండి ఫుల్ గా ట్రాక్ లోకి రానున్నాడు. కాసేపటి క్రితం ఈ సినిమాలో తనతో కలిసి నటిస్తున్న కొత్త హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ను మీడియాకు పరిచయం చేస్తూ, 

సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయతో కలిసి మీడియాతో ముచ్చటించారు నాని. ఇకపోతే రేపు తమ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మరియు తాను కలిసి నటించిన ఒక ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేస్తామని, అలానే అతి త్వరలో ట్రైలర్ సహా సినిమాకు సంబందించిన అన్ని వివరాలు ఒక్కొక్కటిగా మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. ఇక మరోవైపు తమ సినిమా హీరో సినిమాకు ప్రమోషన్స్ సరిగా చేయడం లేదు అని వాపోతున్న నాని ఫ్యాన్స్ ప్రస్తుతం నేటి అప్ డేట్ తో ఆనందం వ్యక్తం చేస్తూ, తప్పకుండా తమ హీరో ఈ సారి పెద్ద హిట్ కొడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: