మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెని బ్యానర్ పై మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను సినిమా యూనిట్ అప్పుడే మొదలెట్టేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆయా భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. చిరంజీవి మొదటిసారి తన కెరీర్ లో ఒక స్వతంత్ర సమరయోధుడిగా నటిస్తున్న ఈ సినిమాను, 

ఇటీవల బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పోలుస్తూ ఒక ఆసక్తికర పోటీకి తెరలేపుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమా అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి, ఆ అంచనాలను అందుకోవడంలో బాగానే సఫలం అయింది. అలానే బాలయ్య కూడా శాతకర్ణి గా తన అద్భుతమైన నటన మరియు డైలాగ్స్ తో సినిమాను మరింతగా సక్సెస్ సాధించేలా చేసారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైరా మూవీలో మెగాస్టార్, శాతకర్ణి లో బాలయ్య నటనను మించేలా నటించి పేరు సంపాదించగలరా అంటూ కొందరు నందమూరి ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మెగా ఫ్యాన్స్ పై ఛాలెంజ్ లు విసురుతున్నారు. దానితో వారి మధ్య సోషల్ మీడియాలో కొద్దిపాటి మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఆ ఇద్దరు హీరోల అభిమానులు ఒక ముఖ్య విషయం మరిచిపోతున్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. అదేమిటంటే, 

శాతకర్ణి సినిమా అప్పట్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన మాట వాస్తవమేనని, అయితే త్వరలో రాబోతున్న సైరా సినిమా, స్వాతంత్రోద్యమ నేపథ్యం ఉన్న సినిమా కావడం, అదీకాక తొలిసారి మెగాస్టార్ స్వాతంత్రోద్యమ వీరుడిగా నటిస్తుండడంతో సినీ ప్రేక్షకుల్లో మంచి విపరీతమైన అంచనాలు ఉండడం సహజమని, ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ను బట్టి చూస్తుంటే, సినిమాలో మెగాస్టార్ తన నటనను అదరగొట్టినట్లు అర్ధమవుతుందని అంటున్నారు. అయితే బాలయ్య పోషించిన శాతకర్ణి ఒక చక్రవర్తి, చిరంజీవి నటిస్తున్న నరసింహారెడ్డి ఒక యోధుడు. ఒకరకంగా ఈ ఇద్దరూ కూడా వీరులేనని, అదీకాక చిరంజీవి, బాలకృష్ణ ఎవరికి వారు అద్భుతన నటులు అనే విషయం మరువకూడదని, కాబట్టి ఒక సినిమాలో హీరో నటనను మరొక సినిమాలోని హీరో నటనతో పోలుస్తూ ఇలా వాదించుకోవడం సరికాదని వారంటున్నారు.....!!    



మరింత సమాచారం తెలుసుకోండి: