అదేంటో నందమూరి ఫ్యామిలీ హీరోల్లో  ఎటువంటి సఖ్యత కనిపించదు. మెగా ఫ్యామిలీని చిరంజీవి ఏకత్రాటిమీద నడుపుతూంటే బాలయ్య మాత్రం తన ఫ్యామిలీ హీరోలను కలుపుకుని ముందుకుపోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక బాలయ్య అపుడే నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హీరోగా ఉన్నాడు. ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. అన్ని రకాల పాత్రలు చేయగల సత్తా తమకు ఉందని బాలయ్య ప్రూవ్ చేసుకున్నాడు.


ఇక నందమూరి హీరోలు చాలా మంది వచ్చారు. హరిక్రిష్ణ కొన్ని సినిమాల్లో నటించగా ఆయన ఇద్దరు కుమారులు హీరోలు అయ్యారు. జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రాం వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇంకో హీరో తారకరత్న కొన్ని మూవీస్ చేసి సైలెంట్ అయ్యాడు. ఇక చంద్రబాబు తమ్ముడి కొడుకు నారా రోహిత్ కూడా హీరోగా  మంచి సినిమాలు చేశాడు. అయితే వీరిలో బాలయ్య తరువాత స్టార్ డమ్  తెచ్చుకున్నది మాత్రం జూనియర్ ఎన్టీయారే.


కానీ ఎన్టీయార్ కి బాలయ్యకు పడదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. హరిక్రిష్ణ చనిపోయాక బాలయ్య అన్న పిల్లలను దగ్గరకు తీస్తారనుకున్నా ఆ గొడవలు అలాగే ఉండిపోయాయి. ఇక బాలక్రిష్ణ కుమారుడు కూడా సినీ రంగంలోకి రావడానికి ఆసక్తిని చూపించడం లేదు. దాంతో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడవతరం హీరోగా సూపర్  స్టార్ గా జూనియర్ మాత్రమే ఉన్నారనుకోవాలి. కానీ జూనియర్ విషయంలో బాలయ్య మరి ఎందుకు ఆసక్తి కనబరచరు అన్న చర్చ కూడా ఉంది.


అయితే తమ మధ్య విభేదాలు లేవని ఈ ఇద్దరూ బయటకు చెబుతున్నా తెలియనివి ఏవో ఉన్నాయని అంతా అంటారు. దానికి ఆజ్యం పోయడానికా అన్నట్లుగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ మాటలు ఉన్నాయంటున్నారు. ఆయన ఓ చానల్ ఇంటర్వ్యూలో టీడీపీకి జూనియర్ ఎన్టీయార్ అవసరం లేదని గట్టిగా చెప్పేశారు. జూనియర్ రావాలనుకుంటే రావచ్చునని కూడా చాయిస్ ఆయనకేనంటూనే టీడీపీకి ఆ అవసరం లేదని చెప్పడం ద్వారా మంట పెట్టేశాడు.


దాంతో ఇపుడు జూనియర్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య కొత్త చిచ్చు రాజుకుంది. అసలే జూనియర్ అంటే  పడని  బాలయ్య ఫ్యాన్స్ ఓ వైపు ఉంటే బాలయ్య ఫ్యాన్స్ ని ఇపుడు జూనియర్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఈ గొడవ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: