టీడీపీ యువనేత  భరత్ సంవత్సరం క్రితం ప్రత్యక్ష రాజకీయల్లోకి వచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైజాగ్ ఏమ్ పి గా పోటి చేసి ౩౦౦౦ ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన  ఇంటర్వ్యూ  ఆసక్తికరమైన విషయలను వెల్లడించారు.మీకు ఏ హీరో ఇష్టం అన్న ప్రశ్నకి  చిరంజీవిగారి ఇంద్ర అంటే ఇష్టం, నాగార్జునగారి మన్మధుడు, వెంకటేష్ గారు చేసిన నువ్వు నాకు నచ్చావ్, మా మామయ్యగారి సినిమాల్లో అప్పట్లో సమర సింహారెడ్డి, ఇపుడు గౌతమీ పుత్ర శాతకర్ణి అంటే ఇష్టం అని తెలిపారు. .నా చిన్నతనం మొత్తం వీళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను అని అన్నారు.
 

బాలకృష్ణ  కన్నా చిరంజీవి ఎక్కువ వైవిధ్యమైనా పాత్రలు వేసారు కాదా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన ఈ విధంగా సమాధనం చేప్పారు.చిరంజీవి గారిని , బాలకృష్ణ గారిని పోల్చలేం. చిరంజీవి గారు  బ్యాగ్రాండ్ లేకుండా వచ్చారు. ఆయన్ మొదట విలన్ పాత్రలు తరువాత సహయక పాత్రలు ఆ తరువాత హీరో పాత్రలు వేసారు.  ఈ క్రమంలో ఆయన వివిధ పాత్రలు వేసారు.  కానీ బాలకృష్ణ గారి విషయంలో అలా కాదు ఎన్టీఆర్ గారి అబ్బాయిగా వచ్చారు.

సమర సింహారెడ్డి చెన్న కేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, ఇలా 7 సంవత్సరాలు  ఒకే రకం పాత్రలు వేశారు.  బాలకృష్ణ  గారు ఫ్యాక్షన్ జానర్ లో స్ట్రాక్ అయ్యారు. కానీ చిరంజీవి గారు అలా చేయలేదు. ఆయన ఒక పాత్రలో  స్ట్రక్ కాలేదు. అన్ని పాత్రలను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు.మమాయ్య గారు కొంతకాలం నుండి ఆ ఇమేజ్ నుండి బయటకి వచ్చి కొత్త రకం కథలను ట్రై చేస్తున్నారు. ఆయనలో ఇంకా చాలా పోటెన్షియల్ ఉంది. కొత్త డైరక్టర్లు చాలా కొత్త రకం కథలతో ఆయన దగ్గరికి వస్తే. మనం చూడలేని మరిన్ని కొత్త రకం పాత్రలను బాలకృష్ణ గారిలో చూడవచ్చు అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: