సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తొలిసారి తమ నిర్మాణ సారథ్యంలో 2015లో నిర్మించిన సినిమా శ్రీమంతుడు. మహేష్ బాబు సరసన లోకనాయకుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్ జోడి కట్టిన ఈ సినిమా, అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, అంతకముందు కెరీర్ పరంగా కొంత ఢీలాపడ్డ సూపర్ స్టార్ మహేష్ కు మంచి జోష్ ని ఇచ్చింది. మహేష్, శృతి తొలిసారి జోడికట్టడం, 

కొరటాల శివ అంతకముందు ప్రభాస్ తో మిర్చి వంటి సూపర్ హిట్ ని అందుకొని ఉండడంతో, ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ తరువాత తొలిరోజు, తొలి ఆట నుండే శ్రీమంతుడు అద్భుతమైన టాక్ తో ముందుకు దూసుకెళ్లడం జరిగింది. హర్ష క్యారెక్టర్ లో మహేష్ అద్భుత నటన, స్క్రీన్ పై మహేష్, శృతిల పెయిర్ అదిరిపోవడంతో పాటు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అలరించే సంగీతం, మది సూపర్బ్ ఫొటోగ్రఫి ఈ సినిమాకు మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి. ఇక అప్పట్లో వసూళ్లపరంగా కూడా అద్భుతమైన రికార్డులు నెలకొలిపిన ఈ సినిమా, ప్రస్తుతం యూట్యూబ్ లో 71 మిలియన్లకు పైగా వ్యూస్ తో నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతూ, 

ఇప్పటి వరకు మరే టాలీవుడ్ సినిమా సాధించని ఖ్యాతిని దక్కించుకుంది. ఇక ఆ తరువాత వరుసగా రెండు మరియు మూడవ స్థానాల్లో 6.42 మిలియన్ల వ్యూస్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా, అలానే 6.41 మిలియన్ల వ్యూస్ తో నాచురల్ స్టార్ నాని నటించిన నేను లోకల్  సినిమాలు నిలిచాయి. ఇక ఈ విధంగా శ్రీమంతుడు కలెక్షన్ల రికార్డుల పరంగానే కాక, యూట్యూబ్ వ్యూస్ పరంగా కూడా దూసుకుపోతుండడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతూ, ఆ న్యూస్ ని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: