ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2, ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. అప్పటివరకు కాస్త రిజర్వుడ్ పాత్రల్లో నటించిన వరుణ్, ఈ సినిమాతో పూర్తి స్థాయిలో తన కామెడీ యాంగిల్ ని బయటకు తీసి మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు అనే చెప్పాలి. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. కొద్దిరోజుల క్రితం తమిళ నటుడు బాబీ సింహ ప్రధాన పాత్రలో, కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ అనే తమిళ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, 

'జర్ర జర్ర' లిరికల్ సాంగ్, మరియు వీడియో సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక టీజర్ ని బట్టి  చూస్తే, ఈ సినిమాలో వరుణ్, ఫస్ట్ టైం అదరగొట్టే పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు అర్ధం అవుతుంది. అసలే మాస్ సినిమాలు తెరకెక్కించడంలో మంచి దిట్టగా పేరుగాంచిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు అవడంతో, సినిమా పై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఆమె లుక్ ని రివీల్ చేయని వాల్మీకి టీమ్, నేడు సడన్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. పక్కా ఓల్డ్ క్లాసికల్ హీరోయిన్ మాదిరిగా చక్కగా లంగా వోణితో, రెండు జడలు వేసుకుని, ఓల్డ్ మోడల్ అట్లాస్ సైకిల్ తొక్కుతూ ఉన్న ఆ పోస్టర్ లో నిజంగా పూజ ఎంతో బాగుందనే చెప్పాలి. 

కేరీర్ పరంగా ఇప్పటివరకు ఎక్కువగా మోడరన్ అమ్మాయి పాత్రలే పోషించిన పూజ హెగ్డే, ఈ సినిమాలో శ్రీదేవి అనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర పోస్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ లో పూజను చూస్తుంటే, పాత కాలం నాటి హీరోయిన్లు గుర్తుకువస్తున్నారని ఆమెపై పలువురు సినీ ఫ్యాన్స్ పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్న ఈ సినిమా, వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: