ప్రభాస్ సాహో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో, సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది.  దాదాపు 250 కోట్ల రూపాయల పై ఖర్చుతో సినిమా నిర్మితమైంది.  ఆ రేంజ్ లోనే బిజినెస్ కూడా జరుపుకుంది.  ఎంత పాజిటివ్ వైబ్ ఉన్నా ఎందుకో లోలోపల తెలియని భయం అలానే ఉండిపోయింది. 

భారీ హైప్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  అందులో ఒకటి 2పాయింట్ 0.  సాహో కంటే కూడా హైప్ ఎక్కువ వచ్చింది.  చివరకు రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.  దీంతో సినిమా వసూళ్లు కష్టమే అనుకున్నారు.  అయితే, రజినీకాంత్ సినిమా కావడంతో సేఫ్ గా బయటపడింది.  ఇప్పుడు ప్రభాస్ విషయంలో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది టెన్షన్ గా మారింది.  


బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ అంచనాలను దాటుకొని సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇదిలా ఉంటె, ఈ సినిమా గురించి యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  సినిమా అద్భుతంగా ఉందని, ఎవరూ నెగెటివ్ గా ఊహించుకోవద్దని అంటున్నాడు.  


ప్రభాస్ ఇంట్రో సీన్స్ తో సినిమా ఎక్కడికో వెళ్తుందని.. ఆ ఎంట్రీ సీన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నాడు.  ఎంట్రీ సీన్ తోనే ప్రభాస్ సాహో హిట్ టాక్ తెచ్చుకుంటుందని ఉమైర్ ట్వీట్ చేశాడు.  పైగా సినిమాకు 4స్టార్ రేటింగ్ ఖాయం అని చెప్తున్నాడు.  సినిమా ఆ రేంజ్ లో హిట్టయితే కనుక చెప్పాల్సిన అవసరం ఏముంది.. ప్రభాస్ రేంజ్ మరోసారి పెరిగిపోతుంది.  బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయి.  మరి ఎలా ఉన్నది అనే  అసలైన టాక్ తెలియాలంటే 30 వ తేదీ వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: