సినీ ఇండస్ట్రీలో కొన్ని సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ల‌కు పెళ్లి ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు విడిపోతారో ఎవ‌రికీ అర్ధం కాదు. ఒకే ప్రొఫెష‌న్‌లో ఉండి కూడా ఇద్ద‌రి మ‌ధ్య విభేధాలు రావ‌డం వెనుక కార‌ణాలు ఏమైనా స‌రే వీళ్ళు చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసేసుకుంటారు. అలాగే ఇక్క స‌హ‌జీవ‌నాలు కూడా కాస్త ఎక్కువ‌గానే జ‌రుగుతుంటాయి. శృంగార భామ మ‌లైకాఅరోరా, అర్జున్‌క‌పూర్ విష‌యానికి వ‌స్తే వీరిద్ద‌రూ ఎప్ప‌టి నుంచో స‌హ‌జీవ‌నం చేస్తున్న విష‌యం తెలిసిందే. వీరికి సంబంధించి ఓ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.


పెళ్లి వద్దు , శృంగారం మాత్రమే ముద్దు అని అంటోంది హాట్ భామ మలైకా అరోరా . 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే 33 ఏళ్ల అర్జున్ కపూర్ పెళ్లి చేసుకుందామని మలైకా ని అడుగుతున్నాడట కానీ మలైకా మాత్రం పెళ్లి వద్దు ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం అంతే అని ఖరాకండిగా చెబుతోందట .


ఇటీవ‌లె మలైకాఅరోరా తాజాగా తన స్నేహితులతో కలిసి మాల్దీవు బీచ్ ను సందర్శించి సందడి చేశారు. అనంతరం బీచ్‌లో తాను తీయించుకున్న ఫోటోను మలైకాఅరోరా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. మలైకా ఫోటోకు నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. దీంతోపాటు మలైకా అరోరా ప్రియుడైన అర్జున్ కపూర్ కూడా ఆమె పెట్టిన బీచ్ ఫోటోకు క్యూట్ కామెంట్ చేశారు. మలైకాఅరోరా, అర్జున్ కపూర్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో మలైకా ఫోటో పోస్టుకు అర్జున్ కపూర్ క్యూట్ కామెంట్ పెట్టడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
వీరిద్ద‌రి మధ్య 12 ఏళ్ల తేడా ఉంది , అయినప్పటికీ సహజీవనానికి వయసు అడ్డంకి కాదని ఈ ఇద్దరూ నిరూపిస్తూనే ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉంటున్నారు కానీ పెళ్లి మాత్రం వద్దని అంటోందట ! ఎందుకంటే అర్భాజ్ ఖాన్ తో పెళ్లి , విడాకులు , గొడవలు అంటూ విసిగిపోయానని అందుకే పెళ్లి వద్దని అంటోందట కానీ అర్జున్ కపూర్ ఆలోచన మరోలా ఉంది. మొత్తానికి పెళ్లి విషయాన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: