‘సాహో’ ‘సైరా’ మూవీల విడుదల మధ్య కేవలం 32 రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో ఈ రెండు సినిమాలను ఇంచుమించు ఒకేసారి మార్కెట్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘సైరా’ మూవీ పై కూడ సుమారు 300 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరగడంతో ఈ మూవీని కూడ భారీ రేట్లకు మార్కెట్ చేయవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి.

ముఖ్యంగా ‘సాహో’ ఓవర్సీస్ రైట్స్ అన్ని భాషల వర్షన్స్ కు కలిపి 42 కోట్లకు అమ్మడం జరగడంతో అదే స్థాయి ఆఫర్ ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి ‘సైరా’ కు కూడ రావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ స్థాయిలో ‘సైరా’ కు ఓవర్సీస్ మార్కెట్ లో బయ్యర్ల నుండి స్పందన రావడం లేదు అని టాక్. 

అంతేకాదు మెగా కాంపౌండ్ ఆశిస్తున్న భారీ మొత్తాలకు ‘సైరా’ ను కొనాలి అంటే ఈ మూవీకి నాలుగు మిలియన్ డాలర్ల పైన కలక్షన్స్ రావాలని అప్పుడే తమ పెట్టుబడి కనీసం తిరిగి వస్తుందని ఓవర్సీస్ బయ్యర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే ఓవర్సీస్ మార్కెట్ లో ఎంత భారీ హీరో సినిమా అయినప్పటికీ ఇంత భారీ రేంజ్ లో కలక్షన్స్ రావడం కష్టం అన్న అభిప్రాయాన్ని ఓవర్సీస్ బయ్యర్లు చరణ్ వద్ద తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నట్లు టాక్.

ఇది చాలదు అన్నట్లుగా ‘సాహో’ విడుదల కాబోతున్న అక్టోబర్ 2న బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ మూవీ ‘వార్’ కూడ విడుదల కాబోతున్న పరిస్థితులలో ‘సైరా’ హిందీ వెర్షన్ కలక్షన్స్ పై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుందని బూలీవుడ్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు హృతిక్ సినిమాలకు హిందీ ప్రాంతాలలో ఉండే విపరీతమైన క్రేజ్ ‘సైరా’ ను దెబ్బ తీస్తుందని దీనితో ఈ ప్రభావం ఓవర్సీస్ మార్కెట్ పై కూడ పడుతుంది కాబట్టి ‘సాహో’ రేట్లతో పోలుస్తూ ‘సైరా’ ఓవర్సీస్ బిజినెస్ ఆలోచనలు చేయవద్దని ఓవర్సీస్ బయ్యర్లు చరణ్ తో వాదిస్తున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: