నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ ప్రముఖ వ్యాపారవేత్త. సాధారణంగా అతడు మీడియాకు దూరంగా ఉంటాడు. అయితే గత ఎన్నికలలో అతడు విశాఖపట్నం నుండి పోటీ చేసిన నేపధ్యంలో ఎన్నికలలో ఓడినప్పటికీ మీడియాతో చాల స్నేహపూర్వకంగా ఉంటున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ ఛానల్ కు భరత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు బాలయ్య గురించి తెలియ చేసాడు. వాస్తవానికి బాలకృష్ణకు ఆయన సమర్ధతకు తగిన రీతిలో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని బాలయ్యకు సరిపోయే విధంగా రచయితలు కాని దర్శకులు కానీ బాలయ్య తీరుకు నప్పే పాత్రలను సృష్టించ లేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు.

వాస్తవానికి బాలయ్యకు కోపం ఎక్కువ అన్న ప్రచారం ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందని బహుశా ఆ భయంతోనే అనేకమంది ప్రముఖ రచయితలు దర్శకులు బాలయ్యకు తగ్గ పాత్రలు సృష్టించి ఆయన వద్దకు వెళ్లి చెప్పి ఒప్పించడానికి భయపడి ఉంటారు అని భరత్ అభిప్రాయం. బాలకృష్ణకు కోపం లేదని ఒకవేళ కోపం వచ్చినా ఆ కోపం వెంటనే తగ్గిపోతుందని అంటూ తన మామయ్యకు వెన్న లాంటి మనసు అంటూ బాలయ్య పై విపరీతమైన ప్రశంసలు భరత్ కురిపించాడు.

అయితే ఈ విషయంలో చిరంజీవి అదృష్టవంతుడనీ తనకు ఎలాంటి పాత్రలు సరిపోతాయో తన రచయితలకు దర్శకులకు చెప్పి చాల చక్కగా తనకు సరిపోయే పాత్రలలో నటించి చిరంజీవి చాల తెలివిగా తన కెరియర్ ను మలుచుకున్నాడు అంటూ భరత్ కామెంట్స్ చేసాడు. అయితే తాను చిన్నప్పటి నుండి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగిన తాను బాలయ్య లాంటి టాప్ హీరో కూతురుని పెళ్ళి చేసుకుంటాను అని ఏనాడు అనుకోలేదు అంటూ భరత్ తన పై తానే జోక్ చేసుకున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: