మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా.. నరసింహారెడ్డి సినిమా రిలీజ్ కు దగ్గరపడుతోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ మెగాస్టార్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేయటానికి నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను నేషనల్ వైడ్ గా తీసుకెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లలో ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.

 


హిందీలో ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను అమితాబ్ బచ్చన్ తీసుకోనున్నారని బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనివల్ల సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చి ప్రేక్షకులకు చేరువవడం ఖాయం. అలాగే తమిళ్ లో కూడా రిలీజవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఆహ్వానించేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఓ భారీ ఈవెంట్ నిర్వహించి అమితాబ్ బచ్చన్-చిరంజీవి-రజినీకాంత్ లను ఒకే వేదికపైకి తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ముగ్గురు ఇండియన్ ఫిలిం సూపర్ స్టార్లను ఒకే వేదికపై చూసే అవకాశం దక్కుతుంది. కన్నులపండుగ లాంటి ఈ దృశ్యం నిజమో కాదో తేలాలంటే అఫీషియల్ కన్మర్మేషన్ రావాల్సిందే. మిగిలిన భాషల్లో ప్రమోషన్ ఈవెంట్లకు కూడా అక్కడి స్టార్లను ఆహ్వానించే పనిలో యూనిట్ ఉందట.

 


చిరంజీవి రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన మళ్లీ సినిమాలు చేయాలని పలు వేదికల మీద అమితాబ్, రజినీకాంత్ బాహాటంగానే చెప్పారు. అమితాబ్ సైరా.. లో ఓ పాత్ర కూడా వేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అందునా పాన్ ఇండియా సబ్జెక్ట్ గా తెరకెక్కడంతో వీరిద్దరూ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంటే సినిమా ప్రేక్షకులకు మరింత చేరువవుతుందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: