‘సాహో’ విడుదలకు ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈమూవీ కలక్షన్స్ రికార్డుల పై భారీ చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘సాహో’ కు ఫిక్స్ చేసిన కలక్షనస్ టార్గెట్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

‘సాహో’ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం విషయం అటుంచి ఈ సంవత్సరం విడుదలైన కొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయగలిగితే ‘సాహో’ తన మొదటి విజయం సాధించినట్లే అంటూ కామెంట్స్ చేసాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 290 కోట్ల నెట్ కలక్షన్స్ దాటిన తరువాత మాత్రమే ఈ మూవీ బయ్యర్లు గట్టెక్కుతారని తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడుతున్నాడు.

ఈ సినిమా తొలిరోజు 50 కోట్లు మలి రెండ్రోజులు మరో 100 కోట్లు బాలీవుడ్ లో వసూలు చేస్తుంది అని అంచనాలు వస్తున్నా ‘సాహో’ 2019 బెస్ట్ హిట్ అవ్వాలి అంటే హిందీ పరిశ్రమలో ఈ ఏడాది ఘనవిజయాలు సాధించిన 10 సినిమాల రికార్డులను బ్రేక్ చేయవలసి ఉంటుందని తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడుతున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది నెంబర్ వన్ హిట్ ‘కబీర్ సింగ్’ రికార్డును ‘సాహో’ బ్రేక్ చేయగలిగితే ఆమూవీ నెంబర్ వన్ అవుతుందనీ తరణ్ అభిప్రాయపడుతున్నాడు. 

ఇక ‘కబీర్ సింగ్’ తర్వాత ‘యూరి’ చిత్రం 235 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉంటే ఆతరువాత స్థానాలలో ఉన్న ‘భారత్’ ‘మిషన్ మంగళ్’ ‘టోటల్ ధమాల్’ ‘సూపర్ 30’ ‘గల్లీ బోయ్’ లాంటి సినిమాలకు వచ్చిన అత్యంత భారీ లాభాలు ‘సాహో’ బయ్యర్లకు వస్తాయా అంటూ తరణ్ ఆదర్శ్ ప్రశ్నిస్తున్నాడు. దీనితో కలక్షన్స్ టార్గెట్ విషయంలో లాభాల విషయంలో ఈ బాలీవుడ్ విశ్లేషకుడు చెపుతున్న అంచనాలను ‘సాహో’ అమ్డుకోలేకపోతే ప్రభాస్ కు బాలీవుడ్ లో తీవ్ర నిరాస ఎదురయ్యే అవకాశం ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: