ప్రస్తుతం పూరీ జగన్నాథ్ బ్యాంకాక్ లో తన ఫ్యామిలీతో హాలిడేను ఎంజాయ్ చేస్తూనే విజయ్ దేవరకొండతో తాను త్వరలో మొదలుపెట్టబోయే మూవీ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి ‘ఫైటర్’ అన్న టైటిల్ రిజిష్టర్ చేసిన నేపధ్యంలో ఆ టైటిల్ కు అనుగుణంగా ఒక బాక్సర్ జీవితం చుట్టూ పూరీ విజయ్ దేవరకొండల మూవీ ఉండబోతుందని లీకులు వస్తున్నాయి.

అంతేకాదు ఈ టోటల్ స్క్రిప్ట్ పూర్తి అయ్యే సరికి పూరీ గతంలో రవితేజాతో తీసిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ మూవీకి సీక్వెల్ గా ఈ ‘ఫైటర్’ కథ తయారైందని సమాచారం. దీనితో షాక్ అయిన పూరీ తాను తయారు చేసిన కథకు మార్పులు చేస్తున్నట్లు టాక్. 

వాస్తవానికి పూరీ పరాజయాల బాటలో ఉన్నప్పుడు జూనియర్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథ రవితేజాను దృష్టిలో పెట్టుకుని మరొక కథ వ్రాసినట్లు టాక్. అయితే అప్పట్లో పూరీ వరస పరాజయాలలో ఉన్న నేపధ్యంలో ఈ టాప్ హీరోలు ఇద్దరు పూరీతో సినిమాలు చేయడానికి భయపడిపోయారు. 

అయితే ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సస్ తో జోష్ లో ఉన్న పూరీ పై ‘డియర్ కామ్రేడ్’ షాక్ లో ఉన్న విజయ్ దేవరకొండ దృష్టి పడటంతో ఇప్పుడు అతడి కోసం పూరీ తయారు చేస్తున్న కథ గతంలో జూనియర్ రవితేజాలకు చెప్పిన రెండు కథలు ఒక కథగా మార్చి ఆ కథే ‘ఫైటర్’ అంటూ విజయ్ తో చేపుతున్నాడనితెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ విజయ్ దృష్టి వరకు వెళ్ళడంతో ఇప్పటికే ఫెయిల్యూర్ టాక్ లో ఉన్న తనతో పూరీ చేస్తున్న ప్రయోగాల పై ఈ యంగ్ హీరో తెగ మధన పడుతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: