ప్రభాస్ సాహో రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్నది.  మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.  ప్రభాస్ సినిమా కోసం ఇప్పటికే థియేటర్లు ముస్తాబయ్యాయి.  అయితే, బాబుబలి ప్రారంభం నుంచి సాహో ఎండింగ్ వరకు మొత్తం ఏడేళ్లు ఈ మూడు సినిమాల కోసం వినియోగించాడు.  ఇది చాలా సమయం అని చెప్పాలి.  ఈ స్థాయిలో ఒక హీరో సినిమాల కోసం సమయాన్ని కేటాయించడం అన్నది అరుదైన విషయం.  


భారీ సినిమాలంటే ఇలానే ఉంటాయి మరి.  బాహుబలి తరువాత ఏడాదికి రెండు సినిమాలు ప్లాన్ చేస్తానని చెప్పిన ప్రభాస్ దాన్ని నిలుపుకోలేకపోయాడు.  ఇకపై చెప్పానని ఏడాదిని రెండు చేస్తానని ప్రభాస్ అంటున్నాడు.  ఏడాదికి రెండు చేయాలి అంటే మాములు సినిమాలు చేయాలి.  బాహుబలి, సాహో లాంటి సినిమాలకు దూరంగా ఉండాలి.  


ప్రభాస్ ఇప్పుడు అదే చేయబోతున్నాడట.  కొన్నాళ్లపాటు భారీ సినిమాలకు దూరంగా ఉంది ఎప్పటిలాగే లవ్, ఫ్యామిలీ సినిమాలు చేయాలనీ అనుకుంటున్నట్టు చెప్తున్నాడు.  ఇది నిర్మాతలకు బానే ఉన్న ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు.  ప్రభాస్ ను ఇంటర్నేషనల్ స్టార్ గా చూడాలని అనుకుంటున్నారు.  


అలా ఇంటర్నేషనల్ స్టార్ గా చూడాలని అనుకుంటే.. అలా కాకుండా కేవలం మాములు హీరోగా ఉండాలని అనుకోవడం ఏంటని పాపం బాధపడుతున్నారు.  ఎలాగైనా సరే ప్రభాస్ అలానే ఉండాలని, ప్రభాస్ రేంజ్ పెరుగుతూనే ఉండాలని ఫ్యాన్స్ తాపత్రయ పడుతున్నారు.  ప్రభాస్ చెప్పినంత మాత్రానా అది సాధ్యం అవుతుందా చెప్పండి.  ఒక్కసారి ఆ రేంజ్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాక, అలాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అంతకు మించి వేరే మార్గం లేదు.  ఇప్పటికే చాలామంది దర్శకులు భారీకథలతో ప్రభాస్ గుమ్మం ముందు సిద్ధంగా ఉన్నారు.  మరోవైపు ప్రభాస్ తో రామాయణం చేయడానికి అల్లు అరవింద్ సిద్ధం అవుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: