ఎవరైనా పదికోట్లు ఇస్తానంటే వద్దంటారా?  ఎవరూ వద్దనరు. ఎపుడెపుడు ఇస్తారా అని కళ్లకు ఒత్తులేసుకొని మరీ వెయిట్ చేస్తారు. అది ఆన్ లైన్ లో వస్తాయా.. లేక క్యాష్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఓ హీరోయిన్ ఆ ఆఫర్ ను వదిలేసుకుంది. 


నిన్నటి తరం హీరోయిన్ శిల్పాశెట్టి తెరపైకి వచ్చి పదేళ్లయింది. ఫేడౌట్ అయిన ఈ సీనియర్ హీరోయిన్ కు పిలిచి 10కోట్లు ఇస్తానంటే.. నో చెప్పేసింది. మనసు చంపుకొని నటించలేనంటోంది. ఇంతకీ శిల్పా శెట్టి మనసును హర్ట్ చేసిన ఆ బంపర్ ఆఫర్ ఏంటో చూద్దాం.. 


వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో వివాహం తర్వాత శిల్పాశెట్టి వెండితెరకు దూరమైంది. 13ఏళ్ల పాటు నటించలేకపోయినా.. యోగా పాఠాలు చెబుతూనే ఉంది. ఈమెకు చాలామంది యోగా గురువుగా భావిస్తూ.. ఫాలో అవుతూ ఉంటారు. ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ ఆయుర్వేద కంపెనీ.. స్లిమ్మింగ్ పిల్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించాలని.. అందుకు పదికోట్లు ఇస్తానని ఆఫర్ చేసింది. 


సన్నబడటానికి వాడే మాత్రల ప్రచారకర్తగా వ్యవహరిస్తే 10కోట్లను రిజక్ట్ చేసింది శిల్పాశెట్టి. తాను నమ్మని విషయాలను ప్రజలకు చెప్పనంటూ బంపర్ ఆఫర్ ను వదిలేసింది. సహజసిద్దంగా బరువు తగ్గితేనే ఆరోగ్యమని చెప్పింది శిల్పా. స్లిమ్మింగ్ పిల్స్.. కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గనంటోంది ఈ యోగా బ్యూటీ. 


దశాబ్దం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన శిల్పాసెట్టి నికమ్మ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత నటించడం ఆనందంగా ఉందనీ.. ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో చూస్తారంటోంది ఈ పొడుగుకాళ్ల సుందరి. మనస్సాక్షిని చంపుకొని.. స్లిమ్మింగ్ పిల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండలేనంటూ.. 10కోట్లు వదులుకున్న శిల్పాను నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: