టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఈ నెల 29న 60వ పడిలో అడుగు పెట్టనున్నాడు. అయితే నాగార్జున అస్వస్థతకు గురైనట్టు వార్తలు విసిపిస్తున్నాయి. ఇటీవల మన్మధుడు 2 సినిమాతో ఆకట్టుకున్న నాగ్, తెలుగు  బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షోలో హోస్ట్ గాను వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఫ్యాన్స్ నాగ్ ఇంటికి వెళ్లగా ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, అస్వస్థతకు గురైయ్యారని సిబ్బంది తెలిపారు.      


ఎప్పుడు ఫిట్ గా కుర్రాడిలా కనిపించే నాగార్జున అస్వస్థతకు గురైయారన్న వార్త తెలుసుకొని ఆయన అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు.. అయితే మన్మదుడు 2 ప్రమోషన్ లోను నాగార్జున చురుగ్గా పాల్గొన్నారు. కాగా అస్వస్థతకు సంబంధించి నాగార్జున కాని ఆయన కుటుంబసభ్యులు కాని ఇంతవరుకు స్పందించలేదు. 


అయితే ఈ నాగార్జున ఆనారోగ్యం కారణం వల్ల కొద్ది రోజులు అతనికి రెస్ట్ కావాలని బిగ్ బాస్ 3 కి గుడ్ బై చెప్పనున్నారట. బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తా అని అనుకున్న సమయం నుంచి ఏదోక వివాదం అయన చుట్టూ ముడుతుంది, కాగా బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్లను సరిగ్గా మేనేజ్ చెయ్యలేక పోతున్నారు అని కొత్తగా ఒక పేరు కూడా వచ్చింది.  


ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 3కి నాగార్జున హోస్ట్ గా తప్పుకున్నారు అని అయన ప్లేస్ లో ఫైర్ బ్రాండ్ బాలయ్య రానున్నారని వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ 'బాలయ్య అయితే అందరిని కంట్రోల్ లో పెడుతాడు' అని ఒకరు అంటే మరి కొందరు స్పందిస్తూ 'బాలయ్య హౌస్ లోకి అడుగు పెడితే దబిడి దిబిడే' అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: