బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇన్‌షా అల్లా.  ప్రముఖ దర్శకుడు  సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫై అంచనాలు మామలుగా లేవు. ఇక ఈసినిమా ఇటీవలే ముంబై లో ఓ సాంగ్  చిత్రీకరణను జరుపుకుంది.  ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కు   బ్రేక్ఇచ్చారట.  దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్లు  వచ్చే ఏడాది ఈద్ కు  విడుదలకావడం కష్టమేనని  అంటున్నారు  బాలీవుడ్ విశ్లేషకులు.  ఇక ఇదిలా ఉంటే  ఇంకా షూటింగ్ కూడా సరిగ్గా స్టార్ట్  కాలేదు అప్పుడే  ఈ సినిమా థియేట్రికల్  హక్కుల కోసం  ఫుల్ డిమాండ్  ఏర్పడింది.  బాలీవుడ్ చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హక్కులను 190కోట్లకు సొంతం చేసుకున్నాడట పెన్ సినిమాస్ అధినేత  జయంతిలాల్ గడ.  



సంజయ్ లీలా భన్సాలీ  నిర్మిస్తున్న  ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ  అలియా భట్  హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ చిత్రం  ముంబై , వారణాసి , హరిద్వార్ అలాగే యూఎస్ లోని ఫ్లోరిడా , ఓర్లాండో తది తర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ ఏడాది ఈద్ కు 'భారత్' తో ప్రేక్షకులముందుకు వచ్చిన సల్మాన్ కు ఆ చిత్రం భారీ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య  విడుదలైన భారత్  బాక్సాఫీస్ వద్ద  బోల్తా పడింది.



ఇక సల్మాన్  ప్రస్తుతం దబాంగ్ 3 లో నటిస్తున్నాడు. ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు , తమిళ , కన్నడ భాషల్లోనూ విడుదలకానుంది.  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తుండగా ..  సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈఏడాది  డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: