నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాకి విడుదల కష్టాలు మరోమారు ఎదురయ్యేలా వున్నాయన్న గాసిప్స్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగివుంటే ఆగస్ట్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. అయితే, ‘సాహో’ సినిమా ఆగస్ట్‌ 15 నుంచి 30వ తేదీకి పోస్ట్‌పోన్‌ కావడంతో నాని వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అయితే మరో డేట్ పిక్స్ చేసిన ఆ డేట్ కు కూడా విడుదల చేయడంలో  హీరో నాని, చిత్ర బృందం తర్జన భర్జనలు చేస్తున్నారనేది టాక్.   ఇకపోతే..


‘సాహో మన సినిమా.. మన తెలుగు సినిమా..’ అంటూ ప్రభాస్‌ మీద అమితమైన అభిమానాన్ని చాటిన నాని, ‘గ్యాంగ్‌ లీడర్‌’ పోస్ట్‌పోన్‌ అయిన విషయాన్ని వెల్లడించాడు. అయితే, సెప్టెంబర్‌ 13వ తేదీకి ‘గ్యాంగ్ లీడర్’ విడుదలకు ఫిక్స్‌ అయినా, మరలా విడుదల వాయిదా వేయడమే మంచిదన్న నిర్ణయానికి నానితోపాటు నిర్మాతలు కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే..


‘వాల్మీకి’కి విషెస్‌ అందిస్తూ, ‘గ్యాంగ్ లీడర్’ కూడా వస్తోందని నాని చెప్పడం, నానికి ‘వాల్మీకి’ తరఫున వరుణ్‌ తేజ్‌ విషెస్‌ అందించడం జరిగింది.కాగా, నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్స్‌ని సెప్టెంబర్‌ 13న విడుదలకు అనుగుణంగా ఉధృతం చేస్తూనే, ఇంకోపక్క పోస్ట్‌పోన్‌ విషయమై దర్శక నిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారన్న వార్త రీసెంట్ గా వెలుగు చూసింది. ప్రస్తుతానికైతే ‘గ్యాంగ్ లీడర్’ దర్శక నిర్మాతలు, సినిమా పోస్ట్‌పోన్‌కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. ఒకవేళ.. సెప్టెంబర్‌ 13న ‘గ్యాంగ్ లీడర్’ విడుదల కాకపోతే, 20వ తేదీకి పోస్ట్‌పోన్‌ అవొచ్చు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌ అయినా కంగారు పడాల్సిన అవసరమే లేదని.. విషయం వున్న సినిమాకే ప్రేక్షకులు జై కొడతారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: