బిగ్ బాస్ 3 ఇప్పుడు తెలుగు, తమిళంలో దుమ్మురేపుతుంది.  తెలుగు లో కన్నా తమిళంలో బిగ్ బాస్ 3 ముందుగానే ప్రారంభం అయ్యింది.  తమిళంలో బిగ్ బాస్ 3 కి హూస్ట్ గా విశ్వనటుడు కమల్ హాసన్ వ్యవహరిస్తున్నా.  మొదటి నుంచి బిగ్ బాస్ ఆయనే హూస్ట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే తెలుగు లో మాత్రం ఇప్పటికీ ముగ్గురు మారారు. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని ప్రస్తుతం బిగ్ బాస్ 3 కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఉన్నారు. తెలుగు ఇప్పటి వరకు ఐదు వారాలు అయ్యాయి.

నటి హేమ, జాఫర్, తమన్నా, రోహిని నిన్న ఆదివారం అషూ ఎలిమినేట్ అయ్యింది. ఇక తమిళంలో వస్తున్న బిగ్ బాస్ 3 లో ఇప్పటి  వరకు ఎన్నో కాంట్ర వర్సీలు వచ్చాయి. మొదట బిగ్ బాస్ హౌజ్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.  రీసెంట్ గా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తమిళ కమెడిన్ మధుమిత ఆత్మహత్యా యత్నం చేసుకోవడం ఆమెను ఇంటి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ తమను బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే తనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కానీ నాపై అన్యాయంగా విజయ్ టీవీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారని మధుమిత ఆరోపిస్తుంది. అయితే బిగ్ బాస్ లో మధుమిత ఆరోపిస్తున్నంత ఘోరంగా ఏమీ లేదని మధుమితతో పాటు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని నామినేట్ అయిన నటి మీరామిథున్ ఈ ఇష్యూపై స్పందించింది.  బిగ్ బాస్ తో మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అందుకే మేం సైలెంట్ గా ఉన్నామన్నారు.

మరో నటి సాక్షి అగర్వాల్ స్పందిస్తూ.. సభ్యులెవరైనా మధ్యలో బయటకి వచ్చేస్తే ఒప్పం దం ప్రకారం మిగిలిన రెమ్యునరేషన్ ని వందరోజులు పూర్తయిన తరువాతనే అందించనున్నట్లు పేర్కొనబడిందని తెలిపింది.  ఈ విషయం తెలిసి కూడా మధు మిత అలా ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. అయితే  ఆమెకి సంబంధించిన ఒప్పందంలో ఏముందో కూడా తనకు తెలియదని సాక్షి చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: