ప్రపంచంలోనే అతిపెద్ద వర్షపు అడవులుగా పేరొందిన అమెజాన్‌ అడవులు పెద్ద యెత్తున దగ్ధమవుతుండడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భూగోళంపై అవసరమైన ఆక్సిజన్‌లో 20 శాతం వరకు అమెజాన్‌ అడవులే అంది స్తున్నాయి.  బ్రెజిల్‌ వాయువ్య ప్రాంతం నుంచి పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, ఫ్రాన్స్‌ వరకు లక్షలాది కిలోమీటర్ల వరకు అమెజాన్‌ అడవులు విస్తరించి ఉన్నాయి. గతంలో బ్రెజిల్ పరిధిలో ఉన్న అమెజాన్ అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగింది.  తాజాగా ఇప్పుడు  బ్రెజిల్‌ పరిధిలోని అమెజాన్‌ అడవులే అంటుకున్నాయి.

ఇక వాటిని ఉద్దేశపూర్వకంగానే అంటించారని అక్కడ ప్రజలు వాపోతున్నారు. కొంత కాలంగా అక్కడ  అక్రమంగా కొంతమంది భూముల కోసం వీటిని తగలబెడుతున్నారని వారు అంటున్నారు.  మంటల నియంత్రణ సహా నష్టాల భర్తీకి సాయం చేయాలని జీ7 దేశాధినేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల సాయాన్ని బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో స్వాగతించారు. మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పినట్లు బోల్సొనారో తెలిపారు. స్పెయిన్‌, చిలీ, పెరుగ్వే దేశాల సాయాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

కార్చిచ్చును అదుపుచేసేందుకు ఇప్పటికే 44వేల మంది సైనికులను మోహరించినట్లు బోల్సొనారో తెలిపారు. భారత్‌లోనూ వివిధ రంగాల ప్రముఖుల తోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ టాప్‌ హీరోలు సైతం అమెజాన్‌ అడవులను రక్షించాలంటూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. తాజాగా టైటానిక్ సినిమాతో కోట్ల మంది అభిమానుల హృదయాలు గెల్చుకున్న హీరో లెనార్డో డికాప్రియో తమ మంచి మనుసు చాటుకున్నాడు.  కేవలం ట్విట్స్ తోనే సరిపోదని అమెజాన్ అడవులు రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రంగంలోకి దిగారు. మెజాన్ ఫారెస్ట్ పునరుద్ధరణ కోసం 36 కోట్ల విరాళం అందిస్తున్నట్లు డి కాప్రియో ప్రకటించాడు. 

డికాప్రియో 2016లో ఉత్తమ నటుడిగా 'ది రెవెనెంట్'చిత్రానికి ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.అమెజాన్ అడవులు లేకుండా ప్రమాదకరమైన 'గ్లోబల్ వార్మింగ్' ని మనం అదుపు చేయలేం. ఈ అడవులు చాలా ముఖ్యమైనవి అని డికాప్రియో పేర్కొన్నాడు.  ఈ నేపథ్యంలో అమెజాన్ అడవుల్లో రెస్క్యూ నిర్వహించేందుకు కొన్ని సంస్థలతో కలసి ఎమర్జెన్సీ చర్యలు చేపట్టబోతున్నట్లు డికాప్రియో సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: