బిగ్ బాస్ ఈ షో హిందీ, తమిళ్ చాలా సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేశారు. అప్పైటిలో ట్రోల్స్ అంటే ఏంటో తెలియకుండా కూల్ గా సాగిపోయింది. ఇక రెండో సీజన్ విషయానికొస్తే.. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షోలో సెలెబ్రెటీల మధ్య రొమాన్స్ లు , కాంట్రవర్సిలు ఎక్కువ అవ్వడంతో నాని హోస్ట్ గా పనికి రాడని అందరిచేత ట్రోల్స్ వేయించుకున్నారు. అభిమానులు అంటూ ఆర్మీలంటూ రచ్చరచ్చ చేశారు.

ప్రస్తుతం మూడో సీజన్ ప్రారంభమైంది.. ఈ షో లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ మొదట కూల్ గా మొదలైంది. రాను రాను గొడవలకు ద్వారాలు తీసింది. మొదటి వారంలో నటి హేమ ఎలిమినేట్ కాగా, రెండోవారం జాఫర్, తమన్నా, రోహిణి, నిన్న ఆషూ రెడ్డి ఎలిమినేట్ అయ్యి, ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఇకపోతే ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమన్నా కూడా మాటలతో సాగుతున్న ఈ బిగ్ బాస్ ప్రస్తుతం అందరిలో ఆసక్తిగా మారింది. 

విషయానికొస్తే నిన్న ఎలిమినేట్  అయిన ఆషూ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వినపడుతున్నాయి. గతంలో జరిగిన సీజన్లో బుల్లి తేరా యాంకర్ శ్యామల, కామన్ పర్సన్ నూతన నాయుడు హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు, ఈ సారి అషూ ని వైల్డ్ కార్డు ద్వారా మల్లి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ యాజమాన్యం. 
మొన్న ఎలిమినేట్ అయినపుడు నాగ్ మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా నువ్వు హౌస్లోకి వస్తే ఎం చేస్తావ్ అనే అషూ ని అడిగిన తీరును బట్టి మల్లి ఈ బబ్లీ గర్ల్ వస్తుందని అర్థమవుతుంది.  అయితే , బిగ్ బోస్ 3 సీజన్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి అధిక మెజారిటీ అషూ కి ఉండటంతో ఈమె మళ్లీ రాబోతుందని అందరు గుసగుసలాడుతున్నారు. రీ ఎంట్రీకి సర్వం సిద్ధంగా ఉన్న అషూ ఏ వారం ఎంట్రీ ఇస్తుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ తప్ప వాచ్ చేయాల్సిందే.. 

ఇది ఇలా ఉండగా మల్లి కొత్త సీజన్లకు కంటెస్టెంట్లను వెతికే పనిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నారని అర్థమవుతుంది. ఈ సీజన్ ప్రారంభానికి సెలెబ్రెటీలు క్యాస్టింగ్ కౌచ్ అనే వాదనలు వినపడ్డాయి. అయితే, అటువంటిది ఏమిలేదని మా ఈ షో ను ఎట్టకేలకు ప్రారంభించారు. సీజన్ 4  ప్రారంభం చేయాలనుకున్న మా కు ఎటువంటి అక్షింతలు పడతాయో... ఈ సారి ఎవరిని సెలెబ్రెటీలుగా తీసుకుంటారో.. టాప్ రేటింగ్, టిఆర్పి తో దూసుకుపోతున్న ఈ రియాలిటీ షో కు ,మళ్ళీ నాగ్ హోస్ట్ గా వస్తారో లేక చిరు ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి... 

మరింత సమాచారం తెలుసుకోండి: