యంగ్ రెబల్ స్టార్  ప్ర‌భాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం 'సాహో'.  కాగా  అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.   ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. అయితే తాజాగా  ప్ర‌భాస్ మీడియాతో మాట్లాడారు. 'సాహో' సినిమా గురించి ప్ర‌భాస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో  సాహోని ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాము.  కాబట్టి, హాలీవుడ్ నుండి చాలా మంది సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేశారు. అలాగే  ప్రతి సన్నివేశానికి మేం చాలా రోజులు రిహార్సల్స్ చేశాము. ఆ పై ప్లానింగ్,  ప్రొడక్టెన్ డిజైన్ వర్క్స్ మరింత ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అన్ని విషయాల్లో చాల జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాము.   కానీ ఆ తరువాత వి.ఎఫ్.ఎక్స్ వల్ల  చాల  ఆలస్యం అయింది. అన్నారు.  


అలాగే సాహో బడ్జెట్ గురించి చెప్తూ..  సినిమా బడ్జెట్ ఎప్పుడైనా  ఆ సినిమా కథకు అనుగుణంగా  ఖర్చు పెట్టాలని నేను నమ్ముతాను. అయినా, నా సినిమాకి ఎప్పుడూ  భారీ బడ్జెట్ పెట్టమని నేను ఏ నిర్మాత పై ఒత్తిడి చేయలేదు.  అయితే  సాహోకి ఎక్కువ  బడ్జెట్ పెట్టడానికి కారణం, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి  యాక్షన్ డ్రామాగా  ప్రేక్షకులను అలరించాలానే లక్ష్యంతో తీశాం. అందుకే భారీ బడ్జెట్ అవసరం అయింది తెలిపారు.  ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలుగా  చేస్తున్నారు.  టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: