మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన కం బ్యాక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకుని, తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక దాని తరువాత ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా, ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా మిగతా ఇతర భాషా సినీ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొనివున్నాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత, అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఒక సినిమాలో నటించనున్నారు. 

ఆ సినిమా కోసం ఇటీవల మెగాస్టార్ తన శరీర బరువును బాగా తగ్గించుకోవడం జరిగింది. అతి త్వరలో అధికారిక పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక డిఫరెంట్ రోల్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయ శాంతి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గతంలో మెగాస్టార్ తో కలిసి దాదాపుగా 15 వరకు సినిమాల్లో నటించిన విజయశాంతి, కొన్నేళ్ల క్రితం సినిమాలకు విరామం పలికి రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, దీని తరువాత విజయశాంతి, త్వరలో మెగాస్టార్ మరియు కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నటించనున్నారని నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మేరకు దర్శకుడు కొరటాల, విజయశాంతి గారిని కథ మరియు అందులోని ఆమె పాత్రను గురించి వివరించడం జరిగిందని, ఆమెకు తన పాత్ర నచ్చడంతో వారి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఆ వార్త యొక్క పూర్తి సారాంశం. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ సినిమా యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తేనే కానీ విశ్వసించలేం అని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: