ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో మూవీపై దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ లో ఆకాశమే హద్దుగా అంచనాలున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు సహా పలు ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా టికెట్స్ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ రిలీజ్ అవుతున్న తమ సినిమా, తప్పకుండా ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని మూవీ యూనిట్ కూడా గట్టి నమ్మకంతో ఉంది. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో ప్రభాస్ తో జోడి కట్టడం, అలానే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ వీక్షకులను ఎంతో అలరించడం, అన్నిటికంటే ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తరువాత ఖచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్న ప్రేక్షకుల నమ్మకం వంటివి, 

ఈ సినిమాకు విపరీతంగా కలిసివచ్చే అంశాలుగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. తెలుగుతో పాటు మిగతా భాషల ప్రమోషన్స్ లపై కొద్దిరోజులుగా సాహో టీమ్ దృష్టి పెట్టి, తమ సినిమాపై మరింత హైప్ తెచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇక నేడు హైదరాబాద్ లో మీడియా మిత్రులతో సమావేశమైన హీరో ప్రభాస్, సాహో గురించి తన అనుభవాలు పంచుకున్నారు. మొదట్లో సాహోకు అంత బడ్జెట్ అనుకోలేదని, అయితే మెల్లగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను బట్టి ఖర్చు కూడా పెరుగుతూ వచ్చిందని, అయినప్పటికీ నిర్మాతలైన తన ఫ్రెండ్స్ మాత్రం, కొంచెం కూడా ఆలోచించకుండా సినిమాకు ఖర్చు చేసారని అన్నారు. అయితే ఎక్కడా కూడా సినిమలో అనవసరపు ఖర్చు కనపడదని, సినిమాకు ఎంతైతే అవసరమో అంతే ఖర్చుపెట్టడం జరిగిందని కూడా చెప్పారు. ఇక తాను, హీరోయిన్ శ్రద్ధ, దర్శకుడు సుజీత్ సహా టీమ్ మొత్తం కూడా రెండేళ్లకు పైగా ఎంతో శ్రమించి ఈ సినిమా కోసం కష్టపడ్డాం అని, రేపు రిలీజ్ తరువాత తప్పకుండా సినిమా సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకం మా అందరికి ఉందన్నారు. 

ఇక దీని తరువాత, జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా తాను ఒక మంచి పాత్రలో నటిస్తున్నానని, ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా కూడా తన ఫ్యాన్స్ కు నచ్చుతుందని ప్రభాస్ అన్నారు. అయితే ఇకపై ఎక్కువగా భారీ రేంజ్ సినిమాల్లోనే నటించాలని నిర్ణయించానని, ఎందుకంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్  బాహుబలి తరువాత తనను ఎక్కువగా అటువంటి క్యారెక్టర్స్ లోనే చూడాలని అనుకుంటున్నట్లు ప్రభాస్ తెలిపారు. అయితే అలాగని తాను మాములు సినిమాలు కూడా చేస్తానని, కాకపోతే పూర్తి కథ, కథనాలు అందరిని అలరించేలా ఉంటె చేయడానికి తాను సిద్ధం అని ఆయన అన్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: