ఐదు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. మొదటి వారంతో పోలిస్తే రేటింగ్స్ తగ్గుతున్నప్పటికీ ప్రేక్షకులు ఈ షోపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. మొదటివారం బిగ్ బాస్ షో నుండి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం జాఫర్, మూడవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి, నాలుగవ వారం రోహిణి, ఐదవ వారం అషు రెడ్డి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. 
 
నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ న్యూస్ పేపర్ పంపుతాడు. బిగ్ బాస్ వీక్లీ పేరుతో వచ్చిన న్యూస్ పేపర్ ఫన్నీగా ఉంటుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎవరిని నామినేషన్ చేయాలనే విషయం గురించి చర్చించుకుంటారు. పునర్నవి రాహుల్ ను వేస్ట్ ఫెలో అంటుంది. బిగ్ బాస్ శివజ్యోతిని మినహాయించి మిగతా ఇంటి సభ్యులలో ఇద్దరు ఒక గ్రూపుగా ఏర్పడమని చెబుతాడు. బాబా భాస్కర్ మహేశ్ విట్టా, వరుణ్ పునర్నవి, రాహుల్ వితిక, శ్రీముఖి హిమజ, అలీ రవి గ్రూపులుగా ఏర్పడతారు. 
 
ఇద్దరు ఇంటిసభ్యులు గార్డెన్ లో నిల్చొని గ్రీన్ రోప్ ను హుక్ నుండి తీసి పట్టుకోవాలి. ఎవరు ఎందుకు నామినేట్ అవ్వాలి ఎవరు ఎందుకు సేఫ్ అవ్వాలి అనే విషయం ఇంటిసభ్యులందరూ ఒకరి తరువాత ఒకరు కారణాలతో సహా వివరించాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు నామినేట్ అవుతారని అప్పుడు సేఫ్ అయిన సభ్యుడు తన చేతిలోని తాడును వదిలేస్తాడని నామినేట్ అయిన సభ్యుని మీద బురద పడుతుందని శివజ్యోతి ఇంటి సభ్యులకు చెబుతుంది. 
 
పునర్నవికి 5 ఓట్లు వరుణ్ 3 ఓట్లు నామినేట్ అవటానికి రావటంతో పునర్నవి ఎలిమినేషన్ కు నామినేట్ అవుతుంది. రవికృష్ణకు 7 ఓట్లు అలీకు ఒక ఓటు రావటంతో రవికృష్ణ నామినేట్ అవుతాడు. బాబా భాస్కర్ కు 2 ఓట్లు మహేశ్ విట్టాకు 6 ఓట్లు రావటంతో మహేశ్ విట్టా నామినేట్ అవుతాడు. హిమజకు 7 ఓట్లు శ్రీముఖికి ఒక ఓటు రావటంతో హిమజ నామినేట్ అవుతుంది. రాహుల్ కు 4 ఓట్లు వితిక కు 4 ఓట్లు రావటంతో కెప్టెన్ శివజ్యోతి వితికకు ఓటు వేసి రాహుల్ ను నామినేట్ చేస్తుంది. కెప్టెన్ శివజ్యోతిని ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయమని చెప్పటంతో వరుణ్ సందేశ్ ను నామినేట్ చేస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ కు పునర్నవి, రవికృష్ణ, మహేశ్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్ నామినేట్ అవుతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: