బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్ మరియు  టైగర్ ష్రాఫ్ లు కలిసి నటిస్తున్న సినిమా "వార్" . వార్ సినిమా యక్షన్ ఎంటర్టైనర్ గా రూపోందుతుంది. ఈ సినిమాను యాష్ రాజ్  సంస్థ వారు అత్యంత ప్రతిస్టాత్మకంగా గా నిర్మిస్తున్నారు. నెల రోజుల కింద రిలీజ్ అయిన సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది.
వార్ సినిమా ట్రైలర్ ను వారం క్రితం రిలీజ్ చేస్తామని ఆఫిషల్ గా అనౌన్స్మెంట్ చేసారు. కానీ తరువాత ట్రైలర్ లాంచ్ ఆలస్యం అవుతుందని రూమర్స్ మొదలయ్యాయి. మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయన్ని డైరక్టర్ సిద్దార్థ కన్ ఫర్మ్  చేసాడు. అవును వార్ సినిమా ట్రైలర్ లాంచ్ ఆలస్యం అవుతుంది. దానికి కారణం మేము   . సినిమా థిమ్ కు మ్యాచ్ అయ్యేలా ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్ గా  చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణల వల్ల అది జరగడం లేదు. అందువల్ల ట్రైలర్ లాంచ్ పోస్టపోన్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ముంబాయి సిని పరిశ్రమ నుండి కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి.  ఇప్పటికే రిలీజ్ అయిన సాహో సినిమా ట్రైలర్ , పాటలు,టీజర్ తో దేశం మొత్తం సాహో ఫివర్ మొదలయ్యింది. ఏ బాలీవుడ్ సినిమాకి రానీ క్రేజ్ సాహో సినిమాకి వచ్చింది. బాలీవుడ్ ప్రేక్షకులు  సాహో రిలీజ్ కోసం అందరికి కన్న ఎక్కువగ ఎదురుచుస్తున్నారు. మరోవైపు  మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమా టిజర్ ముంబాయిలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా టీజర్ కు అధ్బుతమైన ఆదారణ లభించింది.

ఈ రెండు తెలుగు సినిమాలు యూట్యూబ్ లో రచ్చ చేస్తున్నాయి. ఈ సమయంలో వచ్చే "వార్" ట్రైలర్ మామూలుగా ఉంటే సరిపోదు. అందుకోసం తన ట్రేలర్ తో అందరిని తమ వైపు తిప్పుకునేల భారీ లాంచ్ కి ఫ్లాన్ చేస్తున్నరాని టాక్ వినబడుతుంది. సైరా మరియు వార్ సినిమాలు దసరా కానుక గా అక్టోబర్ 2 న విడుదల అవుతున్నాయి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: