మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ప్లాపుల్లో వున్నాడు. అయితే  ఇలాంటి సమయంలో  కూడా  రిస్క్ చేస్తున్నాడు. ఈ సారి అయినా స్టార్ డైరెక్టర్ తో కాకుండా..   ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఆయన  ఓకే చెప్పాడని సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరేంటే సుధీర్ వర్మ.. స్వామి రారాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ మొదటి సినిమాతోనే  మంచి  విజయాన్ని అందుకున్నాడు.  అయితే ఆ తరువాత తీసిన సినిమాలు అన్ని ఫెయిల్ అయ్యాయి. ఇటీవల శర్వానంద్ తో తీసిన గ్యాంగ్ స్టర్ డ్రామా 'రణరంగం' కూడా  ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఈ  సినిమానే రవితేజ తో చేయాల్సింది కానీ ఆ సమయం లో రవితేజ వేరే సినిమాలతో బిజీ గా ఉండడంతో కుదరలేదని సుధీర్ వర్మే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.  ఎట్టకేలకు  ఇప్పుడు రవితేజ ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడట. 




అయితే ఈ సారి సొంత కథతో కాకుండా  రీమేక్ ను నమ్ముకున్నాడు సుధీర్ వర్మ.  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , మాధవన్ హీరోలుగా నటించిన  సూపర్ హిట్ కోలీవుడ్  మూవీ 'విక్రమ్ వేద;'ను సుధీర్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు.  ఈ రీమేక్ లో రవితేజ , విజయ్ సేతుపతి పాత్రలో నటించనున్నాడట.  మరో హీరోను ఎంపిక చేయాల్సివుంది. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన వై నాట్ స్టూడియోస్ ఈ రీమేక్ ను  కూడా నిర్మించనుంది. త్వరలోనే ఈరీమేక్ గురించి అధికారక ప్రకటన వెలుబడనుంది. ఇక  రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ను పూర్తి చేసి, విక్రమ్ వేద రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: