సాదారణంగా మన తెలుగులో నటించే హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుండి వచ్చినవారే. పంజాబు , చెన్నై, కేరళ, కన్నడ ప్రాంతాల నుండి వచ్చిన వారే చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది తెలుగును నేర్చుకొని తెలుగులో మాట్లాడుతుంటారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాము.. 
తమన్నా భాటియా :
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గ్రేడ్ మార్కును సొంతం చేసుకున్న హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఆమెది స్వతహగా పంజాబీ రాష్ట్రము. ఇక్కడ వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. చేసిన ఏ సినిమా అయినా కూడా డబ్బింగ్ మీద నడుస్తుంది. అయితే, ప్రస్తుతం తెలుగు నేర్చుకొని కొన్ని సినిమాలకుగాను ఆమె డబ్బింగ్ కూడా చెప్పుకుంది. 

అనుష్క శెట్టి:
అనుష్క శెట్టి ఈమెను అందరు ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. గతంలో ఎన్ని సినిమాలు చేసిన కూడా ఒక్క బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాతో ఈమె స్థాయి కూడా పూర్తిగా మారిపోయింది. నిజానికి ఈమె కన్నడ బ్యూటీ. తెలుగు తెరలో అడుగు పెట్టిన తర్వాత. ఈమె తెలుగును అనర్గళంగా నేర్చుకొని మాట్లాడుతుంది. 

సమంత :
సమంత అక్కినేని.. ఈ క్యూటీ కేరళ కుట్టి అయితే, తెలుగు సినిమా అవకాశాలు మెండుగా రావడంతో ఈమె తెలుగును పూర్తిగా నేర్చుకుంది. అంతేకాదు తెలుగు హీరో నాగచైతన్య ని పెళ్లిచేసుకుంది కూడాను. అలా పరభాషా నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగును పూర్తిగా నేర్చుకుంది. 

నయనతార :
తమిళ బ్యూటీ లేడీ సూపర్ స్టార్ నయనతార స్వతగాగ ఈమె మాతృభాష తమిళ్. తెలుగులో చాలా సినిమాలు చేయడంతో ఈమె తెలుగును పూర్తిగా అర్థంచేసుకోవడమే కాదు. తెలుగులో మాట్లాడుతుంది కూడాను. 

అమలాపాల్ :
మలయాళ బ్యూటీ అమలాపాల్ కూడా మలయాళం నుంచి తెలుగు సినిమాలలో అడపాదడపా సినిమాలల్లో కనిపించింది. ఇకపోతే ల్యాంవేజ్ ప్రాబ్లెమ్ లేకుండా తెలుగును పూర్తిగా నేర్చుకొని మరి మాట్లాడుతుంది. 

ఛార్మి :
పంజాబీ రస్తా వాసి అయిన ఛార్మింగ్ గర్ల్ ఛార్మి పేరుకు సింగ్.. అంతే హిందీనో, మారాఠినో మాట్లాతారని అనుకుంటారు. అంతే ఫాస్టుగా తెలుగును కూడా మాట్లాడుతుంది. ఒకప్పుడు వరుస సినిమాలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 

ఇలా చెప్పుకుంటూ పోతే రెజీనా, నిత్యామీనన్, రాశికన్నా, రకుల్ ప్రీత్, అనుపమ పరమేశ్వర్, స్నేహ, సాయి పల్లవి, రష్మిక మందన్న ఇలా చాలా మంది పరభాషా హీరోయిన్స్ తెలుగు భాషను నేర్చుకున్నారు. మరో విశేషమేంటంటే.. వాళ్లకు వల్లే సినిమాలలో డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: