అనుష్క శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.  అరుంధతికి ముందు ఆమె చేసిన సినిమాల విషయాలను పక్కన పెడితే.. అరుంధతి తరువాత అనుష్క రేంజ్ పెరిగిపోయింది.  వరసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది.  హీరోలతో కలిసి సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది.  అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే.  ప్రభాస్ తో కలిసి బాహుబలి చేసిన ఈ హీరోయిన్, ఆ తరువాత ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.  


ఒకానొక దశలో ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.  దీనిపై ప్రభాస్ కానీ,  అటు అనుష్క కానీ స్పందించలేదు.  పదేపదే అనుష్క పెళ్లి విషయం గురించి ప్రభాస్ ను అడిగితె.. అనుష్కను పెళ్లి చేసుకోమని చెప్తానని అన్నాడు.  ఆ తరువాత అనుష్క గురించి మీడియాలో ఎక్కువగా మాట్లాడం లేదు ప్రభాస్.  


ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు ప్రభాస్.  సాహూ  సినిమా ప్రమోషన్ చేస్తూ.. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రభాస్ ను మీడియా ఓ ప్రశ్న అడిగింది.  అనుష్కలో గుడ్ క్యాలిటీస్ గురించి చెప్పమని అడిగితె.. యాక్టింగ్, బ్యూటీ, ఫిట్నెస్ అని చెప్పిన ప్రభాస్ తనలో నచ్చని విషయాల గురించి అడిగితె.. కొంచం ఆలోచింది సమాధానం చెప్పాడు.  


అనుష్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఆమెలో నచ్చని విషయం అని ప్రభాస్ చెప్పడం విశేషం.  ఎందుకు ప్రభాస్ ఇలా చెప్పాడో అర్ధం కావడం లేదు.  ప్రభాస్ ఫోన్ మాత్రమే కాదు.. అనుష్కకు ఈ అలవాటు ఉందని, ఎందుకో మరి అంత తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయదని ప్రభాస్ చెప్తున్నాడు.  అదే ఆమెలో ఉన్న మైనస్ అని చెప్తున్నాడు ప్రభాస్.  మరి ప్రభాస్ చెప్పిన ఈమైనస్ గురించి అనుష్క ఎలా రిప్లయ్ ఇస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: