హరీష్ శంకర్  డైరెక్షన్ లో  మెగా హీరో  వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి.  ఈచిత్రం సెప్టెంబర్ 13న విడుదలకానుందని  ఇటీవల అధికారికంగా ప్రకటించారు.  అయితే సాహో  ఈనెల 30 న విడుదలకానున్నడంతో  అదే రోజు విడుదలకావల్సిన నాని గ్యాంగ్ లీడర్ .. వాయిదా పడి వాల్మీకి కి పోటీ గా  వెళ్ళింది.   ఇక ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద  పోటీ పడితే  కలెక్షన్ల పరంగా రెండు సినిమాలకు నష్టం జరిగే అవకాశం వుంది. 



దాంతో నాని గ్యాంగ్ లీడర్ వెనక్కు వెళ్లనుందని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా వాల్మీకి  వెనక్కి వెళ్లి పోయి గ్యాంగ్ లీడర్ కు సైడ్ ఇచ్చింది.  ఇక  వాల్మీకి  సెప్టెంబర్ 20న విడుదలకానుంది. కాగా అదే  రోజు సూర్య నటించిన 'బందోబస్త్' విడుదలకానుండడం తో  వాల్మీకి కి పోటీ తప్పలేదు. అయితే ఇటీవల సూర్య నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోవడం తో ఆ ప్రభావం బందోబస్త్ ఫై పడింది. దాంతో ఆ సినిమాకు హైప్ రావడంలేదు..వాల్మీకికి ఇది కలిసొచ్చే విషయమే. 




కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు  రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్ నటిస్తుండగా  సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ  హీరో అథర్వ మురళి కనిపించనున్నాడు.  కాగా ఇప్పటికే  విడుదలైన ఈ సినిమా టీజర్  సినిమా ఫై అంచనాలను పెంచేసింది.  ఈచిత్రంలో పూజా హెగ్డే , మృణాళిని రవి  కథానాయికలుగా నటిస్తుండగా హాట్ బ్యూటీ డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. 14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్న ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: